Shruti Haasan : హీరోయిన్ తొడలపై దాడి.. టార్చర్ అంటోన్న శ్రుతీ హాసన్
Shruti Haasan స్టార్ హీరోయిన్ శ్రుతీ హాసన్ ఇప్పుడు ఎంతలా కష్టపడుతోందో అందరికీ తెలిసిందే. సినిమా అవకాశాలు తగ్గిపోయినా కూడా ఫిట్ నెస్ మీద మాత్రం మంచిగా దృష్టి పెట్టేస్తోంది. ఇక ముంబైలో ఉంటోన్న ఈ భామ ప్రియుడు శంతను హజారికాతో చేసే అల్లరి ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. సూపర్ మార్కెట్, ఎయిర్ పోర్ట్ ఇలా ఎక్కడపడితే అక్కడే ఈ ఇద్దరూ రొమాన్స్‌లో మునిగిపోతోంటారు. ఆ ఇద్దరికి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.
అయితే శ్రుతీ హాసన్‌కు ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క చిత్రం ఉంది. అది కూడా ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్. ఇందులో శ్రుతీ హాసన్‌కు అదిరిపోయే రోల్ వచ్చినట్టుంది. మొదటిసారిగా ప్రభాస్ పక్కన శ్రుతీ హాసన్ కనిపించబోతోంది. సలార్ సెట్స్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు శ్రుతీ హాసన్ షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక ప్రభాస్ ఇచ్చిన లంచ్ పార్టీ గురించి శ్రుతీ హాసన్ ఎంతో గొప్పగా చెప్పింది. ఆ వంటకాలను చూసి శ్రుతీ షాక్ అయింది.
శ్రుతీ హాసన్ తొడల మీద ట్రైనర్ ప్రతాపం.. Shruti Haasan
అయితే ఎంత తిన్నా కూడా మళ్లీ వర్కవుట్లను మాత్రం మరిచిపోదు. బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటివి శ్రుతీ హాసన్ నేర్చుకుంటోన్నట్టుంది. ఇక తన ట్రైనర్ ఇర్ఫాన్ గురించి శ్రుతీ హాసన్ చెప్పుకొచ్చింది. వర్కవుట్లు మొదలుపెట్టేందుకు వచ్చిన శ్రుతీ హాసన్.. టార్చర్ మొదలు కాబోతోందంటూ తన ట్రైనర్ గురించి హింట్ ఇచ్చింది. ఇక శిక్షణలో భాగంగా ఆయన శ్రుతీ హాసన్ తొడల మీద దాడి చేశాడు. కాలితో తంతూ ఉంటే శ్రుతీ హాసన్ మాత్రం బాగానే భరించింది.