Siddharth : బాబోయ్.. సిద్ధార్థ్ ఇంత మంది హీరోయిన్స్‌ని పటాయించాడా?
Siddharth : కోలీవుడ్ లవర్ బోయ్ సిద్ధార్థ్.. తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఆయన హీరోగా రూపొందిన బొమ్మరిల్లు చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తెలుగులో మంచి హిట్టు అందుకున్నాడు సిద్దార్థ్ . ఆ తర్వాత చుక్కల్లో చంద్రుడు సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్‌తోపాటు క్రేజ్ కూడా పెంచేసుకున్నాడు. వీటితోపాటు చాలా చిత్రాల్లో నటించి తెలుగులో తీసుకున్నాడు. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి డైరెక్షన్‌లో […]
Siddharth : కోలీవుడ్ లవర్ బోయ్ సిద్ధార్థ్.. తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఆయన హీరోగా రూపొందిన బొమ్మరిల్లు చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తెలుగులో మంచి హిట్టు అందుకున్నాడు సిద్దార్థ్ . ఆ తర్వాత చుక్కల్లో చంద్రుడు సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్‌తోపాటు క్రేజ్ కూడా పెంచేసుకున్నాడు. వీటితోపాటు చాలా చిత్రాల్లో నటించి తెలుగులో తీసుకున్నాడు. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి డైరెక్షన్‌లో మహాసముద్రంతో తెలుగు ఆడియెన్స్ ను పలుకరించాడు. ఈ చిత్రంలో అదితిరావు , అనూ ఇమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు.
మహా సముద్రం సినిమాలో కలిసి నటించిన సిద్దార్థ్, అతిధి రావు హైదరీ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు అంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు ముంబై లో ఒక సెలూన్ నుండి వస్తూ మీడియాకు చిక్కారు.దీంతో మీడియా వారి న్యూస్ వైరల్ చేసేసింది. అయితే వీరి ఫోటోలు తీస్తున్న సమయంలోనే సిద్ధార్థ్ మీడియాకు వార్ణింగ్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది. అయితే అదితితో డేటింగ్ చేస్తున్నాడని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో సిద్ధార్థ్ ఎఫైర్స్ కి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. నాగ చైతన్య కంటే సమంత ముందుగా సిద్దార్థ్ తోనే ప్రేమలో పడింది. జబర్దస్త్ సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ జంట కొంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు కూడా.
Siddharth : మాములోడు కాదు..
ఆ తరవాత ఏం జరిగిందో కానీ వీరిద్దరూ దూరమయ్యారు. సిద్దార్థ్ బాలీవుడ్ సినిమా రంగ్ దే బసంతి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సోహా అలీఖాన్ తో ప్రేమాయణం నడిపించాడు. ఆ విషయం తెలుసుకున్న సిద్దార్థ్ మొదటి భార్య ఛీకొట్టి విడాకులు ఇచ్చింది. ఆ తరవాత సిద్దార్థ్ ముంబైలో సోహా అలీఖాన్ ఇంట్లోనే చాలా కాలం ఉన్నాడు. ఇద్దరికీ గొడవలు జరగటంతో సోహా కూడా సిద్దార్థ్ ను వదిలేసింది. శృతిహాసన్ కూడా సిద్దార్థ్ తో సహజీవనం కూడా చేసింది. 2011లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తరవాత వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవు. దీప సన్నిధితో కూడా ప్రేమాయణం నడిపించారని అప్పట్లో తమిళ మీడియా కోడై కూసింది. ఇవన్నీ చూస్తుంటే మనోడు మాములు రసికుడు కాదని అనిపిస్తుంది.