Chinmayi : ఆడదాని శరీరంతో వ్యాపారం చేస్తున్నారంటూ చిన్మయి సంచలన వ్యాఖ్యలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chinmayi : ఆడదాని శరీరంతో వ్యాపారం చేస్తున్నారంటూ చిన్మయి సంచలన వ్యాఖ్యలు..! 

 Authored By kranthi | The Telugu News | Updated on :6 December 2021,11:40 am

Chinmayi : సౌత్ ఇండియన్ ఫేమస్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, చిన్మయి శ్రీపాద పాటలతోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ అంతే బిజీగా ఉంటారు. సామాజిక సమస్యలపై తన గళం వినిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళ సమస్యలపై చిన్మయి పోరాటం చేస్తుంటారు. సమాజంలో సాటి మహిళలు ఎదుర్కొనే సమస్యలను, బాధలను, అకృత్యాలను ఎప్పటికప్పుడూ ఎత్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఎప్పటిలాగే తాజాగా చిన్మయి తన ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని పోస్టులను షేర్ చేశారు. మహిళలకు మేలు చేసేలా ఉండే ఈ పోస్టులపై కొంత మంది మగ వాళ్ళు తీవ్రంగా హార్ట్ అయ్యారు.అంతే ఇక దారుణమైన పద జాలంతో వారంతా చిన్మయి పై విరుచుకు పడ్డారు. చిన్మయి కూడా అదే స్థాయిలో ఆయా జనాలకు కౌంటర్ ఇస్తూ వెళ్ళింది.

ఆ వివాదం ఏంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే రండి. చిన్మయి తాజాగా తన ఇన్ స్టాగ్రాం స్టోరీల్లో అమ్మాయిల పెళ్లిళ్ల విషయాలపై స్పందించారు. ఆడవాళ్లకు కాస్త అవగాహన, ఏజ్ వస్తే చాలు లవ్ మ్యారేజ్ పేరిట వేరే కాస్ట్ వాళ్లని పెళ్లి చేసుకుంటారని భయంతో వారి తల్లిదండ్రులు ఆమెను ఫోర్స్ చేసి ఏ వెధవనైనా పర్లేదు సొంత క్యాస్ట్‌లో పెళ్లి చేసుకోవాలంటూ పట్టు బడుతున్నారని తెలిపింది.వివాహం అనంతరం భర్త తనను ఎంత వేధించినా.. తనతోనే కాపురం చేయాల్సి వస్తోందని వాపోయారు. ఆధునిక యుగంలో కూడా దారుణాలు కొనసాగటం తనకు ఎంతకూ అర్థం కాదని అన్నారు.

Chinmayi : ఏ వెదవనైనా పర్లేదు.. సొంత క్యాస్ట్ వాళ్ళనే చేసుకోవాలంటూ

singer chinmayi posts going vairal in social media

singer chinmayi posts going vairal in social media

ఫారిన్ అబ్బాయిలను పెళ్లాడిన అమ్మాయిల్లో ఇప్పటికీ కొంత మంది ఆడవాళ్లు ఈ కట్నాలు, వేధింపులపై ధైర్యంగా మాట్లాడలేరని అన్నారు. ఆడదాని శరీరంపై ఈ వ్యాపారం ఏంటో తనకు ఎప్పటికీ అర్థం కాదన్నారు. తన పోస్టులను చూసి కొంత మంది అమ్మాయిలైనా సరే కట్నం ఇవ్వను అని నిర్ణయించుకుంటే కూడా అది నాకు చాలని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయంపై స్పందించిన పలువురు మగ వాళ్ళు చిన్మయిని దారుణమైన పదజాలంతో ట్రోల్ చేస్తున్నారు. అబ్బాయిలంతా ఒకేలాగా ఉంటారా అంటూ ఆమెను నిలదీశారు.

ఈ కామెంట్లపై చిన్మయి కూడా అదే స్థాయిలో స్పందించారు. వివాదాన్ని డ్రంక్ అండ్ డ్రైవ్,  నియమాలు పాటించాలని చెబుతారు. అంటే ప్రతీ ఒక్కరూ తాగి బండిని నడుపుతున్నారు అని కాదు. ఆ అవగాహన ఎవరికి అవసరమో వారికే చెబుతున్నట్టు లెక్క. నేను పెడుతున్న పోస్టులు చూసి ఎన్నారైస్ అందరూ అలా అని కాద’ని తెలిపింది. ఒకరిని జనరలైజ్ చేయడానికి అసభ్య పదజాలంతో వాగనక్కర్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది