Geetha Madhuri : గీతా మాధురి గ్లామర్ పెరిగింది.. మళ్లీ తల్లి కాబోతుందా అంటే ఆమె సమాధానం!
Geetha Madhuri : సింగర్ మాధురి కి హీరోయిన్స్ స్థాయిలో గుర్తింపు ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆమె గొంతుకు మాత్రమే కాకుండా ఆమె అందానికి కూడా అభిమానులు ఉంటారు. ఆమె అందంను ఆరాధించే వారు ఎంతో మంది ఉంటారు. హీరో నందును పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న గీత మాధురి రెగ్యులర్ గా ఏదో ఒక షో ల్లో కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం గీతా మాధురి బిగ్ బాస్ ఉత్సవం పేరుతో ప్రతి ఏడాది స్టార్ మా వారు నిర్వహించే భారీ కార్యక్రమంలో పాల్గొంటుంది. ఆ కార్యక్రమంలో బిగ్ బాస్ అయిదు సీజన్ లకు సంబంధించిన పలువురు కంటెస్టెంట్స్ హాజరు కాబోతున్నారు. బిగ్ బాస్ ఉత్సవం లో గీతా మాధురితో అరియానా మాట్లాడించిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
షో లో భాగంగా గీతా మాధురిని ఫన్నీగా రెండవ సారి తల్లి అయ్యేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ఉన్నారు. మీ బుగ్గలు లావు అయ్యాయి, గ్లామర్ పెరిగింది అంటూ అరియానా సరదాగా వ్యాఖ్యలు చేసింది. అందుకు గీతా మాధురి నవ్వుతూ ప్రెగ్నెంట్ ఏమీ కాదు. కొన్ని రోజులుగా రోజుకు పది గంటలకు తగ్గకుండా నిద్ర పోతున్నాను. అందుకే కావు బుగ్గలు లావు అయ్యి గ్లామర్ వచ్చి ఉంటాను అంటూ గట్టిగా నవ్వేసింది. అయినా నేను గర్బవతిని అయితే తప్పకుండా ఆరు లేదా ఏడవ నెల వరకు అందరికి చెప్పేస్తాను. ఆ ఆనందకర విషయాన్ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ గీతా మాధురి చెప్పుకొచ్చింది.

singer geetha madhuri about her second pregnancy
Geetha Madhuri : జై బాలయ్య సాంగ్ తో రచ్చ
ఇటీవల విడుదల అయిన అఖండ సినిమాలో జై బాలయ్య సాంగ్ ను పాడి గీతా మాధురి రచ్చ చేసింది. థమన్ మ్యూజిక్ కు గీతా మాధురి వాయిస్ తోడైతే మాస్ మసాలా ఔట్ పుట్ ఖాయం అంటూ జై బాలయ్య సాంగ్ నిరూపించింది. నటిగా కూడా గీతా మాధురికి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. కాని కెరీర్ ఆరంభం నుండి కూడా గీతా మాధురికి నటనపై ఆసక్తి లేదు. బుల్లి తెరపై అప్పుడప్పుడు కనిపిస్తుంది కాని మొత్తంగా టీవీ షో లు తప్ప సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆసక్తి ఆమెకు లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ ఉత్సవం షూటింగ్ లో పాల్గొంటున్న గీతా మాధురి తన యూట్యూబ్ ఛానల్ మరియు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రెగ్యులర్ గా తన పాపను మరియు తన విషయాలను గురించి వెళ్లడిస్తూనే ఉంది.