
Singer Mangli Income Compare to then and Now
Mangli : సింగర్ మంగ్లీ… ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రతిభ, అదృష్టం ఉంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అని ఈమెని చూస్తే అర్థమవుతుంది. అదృష్టం ఒక్కటే ఉంటే అందలం ఎక్కడం కష్టం.. ప్రతిభ కూడా ఉండి అదృష్టం తోడైతేనే అద్భుతాలు ఆవిష్కారమవుతాయి. మంగ్లీ విషయంలో అదే జరిగింది. ఎక్కడో 5000 రూపాయల నెల వారి జీతం తీసుకుని ఉద్యోగం చేసుకునే మంగ్లీ అనూహ్యంగా ఒకానొక సమయంలో వి6 ఛానల్ లో జాబ్ చేసే ఒక అతనికి కనిపించడం ఏంటి.. అతడి ఆహ్వానం మేరకు ఆ చానల్లో తీన్మార్ అనే వార్త కార్యక్రమంలో పాల్గొనడం ఏంటి.
లంబాడ జాతికి చెందిన ఆమెను సరికొత్తగా ఆ ఛానల్ వారు చూపించడంతో పాటు ఆమెలో ఉన్న గాయనిని అద్భుతంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించారు. ఆ ఛానల్ లో మంగ్లీ జాయిన్ అయిన సమయంలో నెలకు పది వేల రూపాయల జీతం ఇచ్చేవారని సమాచారం, చాలా తక్కువ సమయంలోనే మంగ్లీ ఎంతో మంది అభిమానంను సొంతం చేసుకుంది. తన గొంతుతో తన యొక్క బాడీ లాంగ్వేజ్ తో తన యొక్క ఉత్సాహపరిచే మాట తీరుతో ఆమె తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకుంది. దానికి తోడు ఆమె పాటలు ఒక్కొక్కటిగా సక్సెస్… సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ అన్నట్లుగా అవుతూ వచ్చాయి. దాంతో హీరోయిన్ స్థాయి ఆమెకు దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Singer Mangli Income Compare to then and Now
స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు ఆమె పాట తమ సినిమాలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారంటే ఆమె ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె ఒక్క పాట పాడితే 5 లక్షల రూపాయలు తీసుకుంటుంది, ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక యూట్యూబ్లో ఆమె ఒక్క వీడియో పోస్ట్ చేస్తే మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చి లక్షల్లో ఆదాయం వస్తుంది. ఇంతగా ఆమె సంపాదిస్తుంది అంటే ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం పట్టుదల ప్రతిభ వీటన్నిటికీ తోడు ఒకింత అదృష్టం. కనుక ప్రతి ఒక్కరు కూడా తమలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఏదో ఒక సమయంలో అదృష్టం తోడై మంగ్లీ మాదిరిగా విజయం సాధిస్తారు ఆల్ ది బెస్ట్.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.