Singer Revanth : నాగార్జునకి బలిసిందా.. తెగ తిడుతున్న సింగర్ రేవంత్ అభిమానులు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Singer Revanth : నాగార్జునకి బలిసిందా.. తెగ తిడుతున్న సింగర్ రేవంత్ అభిమానులు!

 Authored By prabhas | The Telugu News | Updated on :5 October 2022,8:00 pm

Singer Revanth : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ సింగర్ రేవంత్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మనం సాంప్రదాయాల ప్రకారం గర్భం దాల్చిన స్త్రీకి శ్రీమంతం చేస్తారు. కడుపులో ఉన్న బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తూ ఏడో నెలలో గర్భవతికి సీమంతం చేస్తారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో మగాడికి సీమంతం చేయబోతున్నారు. ఆ మగాడు ఎవరో కాదు సింగర్ రేవంత్. ఆయన భార్య అన్విత ఇప్పుడు నిండు గర్భిణి. ఇటీవల ఆమె సీమంతం వేడుక జరిగింది. ఆ సీమంతం వీడియోని బిగ్ బాస్ రేవంత్ కు చూపించారు. ఈ వీడియో చూస్తూ ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ ఎపిసోడ్ ను శనివారం నాడు ప్రస్తావించారు హోస్ట్ నాగార్జున.

సీమంతం చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అని నాగ్ అడగ్గానే చాలా బాగుందంటూ రేవంత్ రిప్లై ఇచ్చాడు. మరి నువ్వు ఎప్పుడు చేయించుకుంటున్నావు సీమంతం అని నాగార్జున చిలిపిగా అడుగుతారు. గీతూను దృష్టిలో పెట్టుకొని నాగార్జున ఈ ప్రశ్న వేశారు. వెంటనే గీతు అందుకుంది. ఆ రోజే చెప్పినాను సార్.. కూర్చో నీకు కూడా దీవెన ఇస్తామని చెప్పినాను సార్.. ఎందుకంటే ఈయన కూడా ప్రెగ్నెంటే. ఈయన భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈయన కూడా ప్రెగ్నెంట్ అంటూ గీతూ అంటుంది. గీతూకు సపోర్ట్ చేస్తూ బాలాదిత్య తన వాదన వినిపించాడు. సీమంతం అనేది లైఫ్ టైం మెమొరీ సార్.. మగాడు ఎప్పటికీ ప్రెగ్నెంట్ అవ్వలేడు.

Singer Revanth Fans on comments on Nagarjuna

Singer Revanth Fans on comments on Nagarjuna

ఒకవేళ ప్రెగ్నెంట్ అంటే బేబీ రావడానికి తల్లి ఎలా ఎంజాయ్ చేస్తుందో తండ్రి కూడా అలానే ఎంజాయ్ చేస్తాడనే కాన్సెప్ట్ తప్ప, అన్నింటికి లిటరల్ మీనింగ్ తీసుకోలేం సార్. ఆ ఎమోషనల్ యాంగిల్ లో తప్ప ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ యాంగిల్ అని నా ఒపీనియన్ సార్.. అంటూ బాలాదిత్య మాట్లాడుతుంటే మధ్యలో నాగార్జున దూరి ఏంటి ఇప్పుడు సీమంతం చేద్దాం అంటావా అని అడిగారు నా ఉద్దేశం అది కాదంటూ తప్పించుకున్నాడు. కంటెస్టెంట్స్ తో డిస్కస్ నాగార్జున ఆశీస్సులు దీవెనలు ఇవ్వడానికి సీమంతం చేస్తారు కాబట్టి రేవంత్ కూడా చేయవచ్చని డిసైడ్ చేశారు. రేవంత్ కి శ్రీమంతం అని నాగార్జున ఒక మెసేజ్ పాస్ చేశారు. ఈ విషయంలో హౌస్ సరైన నిర్ణయాన్ని తీసుకొని బిగ్ బాస్ కి చెప్పాలని నాగార్జున సూచించారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది