Siri Srihan : ఒక్క‌టైన సిరి శ్రీహాన్.. మీ ఇద్ద‌రిని ఇలా చూడ‌డం సంతోషంగా ఉంద‌న్న..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Siri Srihan : ఒక్క‌టైన సిరి శ్రీహాన్.. మీ ఇద్ద‌రిని ఇలా చూడ‌డం సంతోషంగా ఉంద‌న్న..!

 Authored By sandeep | The Telugu News | Updated on :5 February 2022,2:30 pm

Siri-Srihan: బిగ్ బాస్ షో ముగిసిన త‌ర్వాత సిరి- శ్రీహాన్, దీప్తి ష‌ణ్ముఖ్ జంట‌లు నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌చ్చారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు సిరి, షన్నులు హద్దులు దాటేశారు. హగ్గులు, ముద్దులు, రిలేషన్ అంటూ ట్రిప్ అవుతున్నా అంటూ చాలా ఓవర్ చేసేశారు. ఇక ఆ ఇద్దరి రొమాన్స్ మీద లెక్కలేనన్ని మీమ్స్, ట్రోలింగ్ వచ్చింది. హగ్గులకు మాత్రం సిరి చాలా ఫేమస్ అయింది. చివరకు కన్నతల్లి వద్దని చెప్పినా కూడా సిరి వినలేదు. ఆదే ఆమెకు ఎక్కువగా నెగెటివ్ అయింది. వారిద్ద‌రి ఓవ‌రాక్ష‌న్‌ని చూసి దీప్తి ఏకంగా బ్రేక‌ప్ చెప్పేసింది.

శ్రీహాన్ కూడా సిరిని వ‌దిలేసాడంటూ నెట్టింట జోరుగా ప్ర‌చారం న‌డిచింది. కాని ర‌వి భార్య పోస్ట్‌తో పుకార్ల‌కి బ్రేక‌ప్ పడ్డ‌ట్టు అయింది.బిగ్ బాస్ షో త‌ర్వాత ..శ్రీహాన్‌ కూడా సిరి ఫోటోలు డిలీట్‌ చేయడంతో పాటు, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరూ ఒక్కసారి కూడా కలిసి ఉన్న ఫోటో షేర్ చేయలేదు. దీంతో వీరు కూడా విడిపోతున్నట్టు వార్తలు ప్రచారం అయ్యాయి. శ్రీహన్ కూడా సిరికి బ్రేకప్‌ చెప్పాడు అంటూ, అందుకే వీరిద్దరూ కలవట్లేదు అని అనుకున్నారు అంతా. ఈ క్ర‌మంలో శ్రీహాన్, సిరి కలిసి యాంకర్‌ రవి ఇంటికి వెళ్లి టైం స్పెండ్ చేశారు. రవి ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగి షేర్ చేశారు.

siri and srihan meets anchor ravi family

siri and srihan meets anchor ravi family

Siri Srihan : గుడ్ న్యూస్ వ‌చ్చేసింది…

దీనికి సంబంధించిన ఫోటోలను యాంకర్‌ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.ఇటీవల వీరిద్దరు కలిసి యాంకర్ రవి కుటుంబాన్ని కలిశారు. వీరంతా కలిసి ఓ రెస్టారెంట్‏లో భోజనం చేసి సందడి చేశారు. ఆ సమయంలో వీరంతా కలిసి దిగిన ఫోటోలను యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. మీ ఇద్దరిని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసింది. ఇందుకు సిరి కూడా హ్యాప్పీ అంటూ స్పందించింది. దీంతో ఇన్ని రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న బ్రేకప్ వార్తలకు ఎండ్ కార్డ్ పడింది. ఈ పోస్ట్ పై నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది