Shanmukh : శ్రీహన్ కావాలా, షణ్ముఖ్ కావాలా..? అనే ప్రశ్నకు ఊహించని సమాధానమిచ్చిన సిరి..!
shanmukh : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఈసారి బాగా వైరల్ అయిన జంట సిరి – షణ్ముఖ్ ది. బయట నుంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత క్రమక్రమంగా బాగా క్లోజ్ అయ్యారు. తామిద్దరం మంచి స్నేహితులమంటూనే లవర్స్ మాదిరి రెచ్చిపోయారు. వారి బంధం ఏంటో హౌజ్ నుంచి బయటకు వచ్చిన సభ్యులకు అర్థం కాకపోగా.. బయట ప్రేక్షకులు కూడా జుట్టు పీక్కున్నారు. ముఖ్యంగా హౌజ్ లో వారి అసభ్యకర ప్రవర్తన చూసి బయట అభిమానులు ఘోరంగా ట్రోల్ చేశారు. ఇద్దరికీ బయట వేరువేరుగా జంటలున్న హౌజ్ లో వారి హగ్గులు, ముద్దులు ఎలా వైరల్ అయ్యాయో.. ఇంకా అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇక హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి వచ్చిన సిరికి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అరియనా నుంచి ఓ చిక్కు ప్రశ్న ఎదురైంది.
తన బాయ్ ఫ్రెండు చోటూ మరియు షణ్ణులలో ఎవరినైనా ఒకరిని ఎంచుకోమని యాంకర్ అరియనా సిరిని సూటిగా ప్రశ్నించింది.అరియనా ప్రశ్నకు మొదట కాస్త తడబడ్డ సిరి.. ఆ తర్వాత తనదైన శైలిలో సమాధానమిచ్చింది. తన జీవితంలో శ్రీహన్ చోటూకే మొదటి ప్రాధాన్యత అంటూ అతనే మొదట తన జీవితంలోకి వచ్చినట్లు తెలిపింది. అయితే షణ్ణును తన బెస్ట్ ఫ్రెండ్‌గా పేర్కొంది. షణ్నుతో పాటు.. జెస్సీ, రవి కూడా తనకు హౌజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అయినట్లు చెప్పుకొచ్చింది. హౌజ్ బయట కూడా షణ్నుతో మంచి స్నేహబంధం కొనసాగిస్తానని చెప్పింది.భారీ ఫాలోయింగ్ తో టాప్ సెలబ్రిటీ హోదాలో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్.. మొదట కొన్ని వారాలు ఆటను పక్కన బెట్టి సోఫాకి పరిమితం అయ్యాడు.

siri answers her relationship with her Shrihan and shanmukh bigg boss 5 telugu interview
shanmukh : నా జీవితంలో శ్రీహన్ మొదటి ప్రాధాన్యత..!
అనంతరం పుంజుకుని ఆటను తనదైన శైలిలో ఆడుతూ విన్నర్ స్థానానికి గట్టి పోటీ ఇస్తాడని అనిపించాడు. అయితే హౌజ్ లో సిరితో అతడి వ్యవహారం రోజురోజుకీ అతడి ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూ వచ్చింది. సిరి హన్మంత్‌తో తన సంబంధంతో పాటు తనకున్న పాపులారిటీతో ఎలాగైనా గెలుస్తాననే మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగానే షణ్ముఖ్ టైటిల్ ను కోల్పోయాడని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు సిరి బాయ్ ఫ్రెండ్ చోటు కూడా ఓ విధంగా షణ్ముఖ్ వైఫల్యానికి కారణమని అంటున్నారు. చోటూ హౌస్ లోకి వచ్చినప్పుడు షన్నును టాప్ 5 లో పెట్టకపోవడం, సిరి షన్నుల బంధంపై సామాజిక మాధ్యమాల్లో ఏవో పోస్టులు పెట్టి డిలీట్ చేయడం కూడా జశ్వంత్ కు టైటిల్ ను దూరం చేశాయని నెటిజన్లు భావిస్తున్నారు.
