Sitara : స‌మంత ఆంటీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన సితార‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sitara : స‌మంత ఆంటీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన సితార‌

 Authored By sandeep | The Telugu News | Updated on :11 May 2022,6:00 pm

Sitara : మ‌హేష్ గారాల ప‌ట్టి సితార ఇటీవ‌లి కాలంలో తెగ సందడి చేస్తుంది. ఒక వైపు సోష‌ల్ మీడియా మ‌రో వైపు స్పెష‌ల్ సాంగ్స్‌లో ద‌ర్శ‌న‌మిస్తూ ర‌చ్చ చేస్తుంది. ఘట్టమనేని నటవారసురాలిగా, మహేష్ బాబు గారాల పట్టీ గా ఇప్పటికే సోషల్ మీడియా లో సితార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సితార ను హీరోయిన్ గా తీసుకొస్తారా..?లేక వేరే రంగంలో తీసుకెళ్తారా..? అనేది మహేష్ అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. స‌ర్కారు వారి పాట ఈ సినిమాలోని పెన్నీ సాంగ్ లో సితార డాన్స్ స్టెప్పులతో అదరగొట్టేసింది. పెన్నీ సాంగ్‌లో కూతురు సితార పర్‌ఫార్మెన్స్‌ గురించి అడగగా “అది థమన్ ఆలోచన. నాకు కూడా తెలియదు.

ఇంటికి వెళ్లి నమ్రత కు చెప్పేలోపు అతనే నమ్రతను అడిగేశాడు. ఇక సాంగ్ లో సితార డాన్స్ చాలా బాగా చేసింది” అని చెప్పుకొచ్చాడు మ‌హేష్ బాబు.సితార కూడా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది. ఈ క్రమంలో సితారకు మహేష్ బాబుతో పని చేసిన హీరోయిన్లకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. సమంత, రష్మిక మందనల గురించి చెప్పమని సితారను అడిగితే.. క్యూట్‌గా సమాధానం చెప్పేసింది.సమంత అని సంబోధిస్తూనే.. సామ్ ఆంటీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసింది సితార. నాతో ఎక్కువగా ఆడుకుంటుంది.. సెట్‌లోకి వచ్చినప్పుడు నాతోనే ఉంటుంది.. ఆడుతూ ఉంటుంది.. ప్లే ఫుల్ అని సమంత గురించి సితార చెప్పేసింది.

sitara friend samantha do you know

sitara friend samantha do you know

Sitara : స‌మంత‌తో క్లోజ్‌నెస్ ఎక్కువే..

ఇక రష్మిక విషయం గురించి చెబుతూ.. ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.. ఎనర్జీగా ఉంటుంది.. క్యూట్‌గా ఉంటుందని సితార తెలిపింది.ఇన్ స్టాగ్రాంలో ఆస్క్ ఎనీథింగ్ అని పెట్టగా అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. వాటిలోంచి కొన్నింటికి మహేష్ బాబు సమాధానం ఇచ్చారు. ఇంట్లో ఎవరు స్మార్ట్ అని అడిగితే.. సితార అని సమాధానం ఇచ్చారు. పెన్నీ సాంగ్‌లో సితార నటించింది కదా? అంటే త్వరలోనేనటిగా కూడా ఎంట్రీ ఇస్తుందా? అని అడిగితే.. ఆల్రెడీ తను నటిగా నిరూపించుకుందని అనుకుంటున్నాను అని మహేష్ బాబు సమాధానం ఇచ్చారు. సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ తనకు ఇష్టమని మహేష్ బాబు తెలిపారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది