Sitara : బాబోయ్ సితార ర‌చ్చ ఏంది.. తండ్రి మూవీ సాంగ్‌లో అద‌ర‌గొట్టిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sitara : బాబోయ్ సితార ర‌చ్చ ఏంది.. తండ్రి మూవీ సాంగ్‌లో అద‌ర‌గొట్టిందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :20 March 2022,5:40 pm

Sitara: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముద్దుల కూతురు సినిమాల్లోకి రాక‌పోయిన అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌ర‌చుకుంది. తొలిసారి ఈ చిన్నారి సర్కారువారి పాట చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ‘ఎవ్రీ ఎవ్రీ పెన్ని..’ అంటూ సాగే పాట‌ని విడుద‌ల చేయ‌గా, ఈ పాటలో మహేష్ బాబు కూతురు సితార ఘట్టమేనిన కూడా కనిపించింది. మొదటిసారి ఈమె స్క్రీన్ మీద కనిపించడం విశేషం. ఇప్పటికే గౌతమ్ నేనొక్కడినే సినిమాలో నటించాడు. అందులో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో అలరించాడు. సినిమా ఫ్లాప్ అయినా గౌతమ్ నటన అందర్నీ ఆకట్టుకుంది.

ఇప్పుడు కూతురు సితార కూడా ఎంట్రీ ఇచ్చింది. తండ్రి కోసం ఆయన సినిమాలోనే ఓ పాటలో మెరిసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో సితారకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదలైన ప్రతీ కొత్త పాటకు డాన్సులు చేసి పోస్ట్ చేస్తుంది. అవి కాస్తా వైరల్ అవుతుంది. కళావతి పాటకు కూడా సితార అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాతోనే వెండితెర ఎంట్రీ కూడా ఇచ్చేలా కనిపిస్తుంది సితార. పెన్నీ పెన్నీ అంటూ సాగే ఈ పాటలో సితార గ్రూప్‌లో లీడ్‌ డ్యాన్సర్‌గా కనిపించింది. సితార చాలా జోష్‌తో స్టెప్పులు వేస్తుండ‌గా, ఇది చూసి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు.

Sitara : సితార ఎంట్రీ అదుర్స్..

sitara penny video song released

sitara penny video song released

సర్కారు వారి పాట నుంచి దుమ్ములేపే మాస్ సాంగ్ వస్తుందనుకుంటే.. అంతకు మించి అన్న లెవెల్ లో పెన్నీ సాంగ్ ను రెడీ చేశారు మేకర్స్. ఏకంగా తండ్రి పాటలో సితార పాప స్టెప్పులను మిక్స్ చేసి వదిలారు. ఇంకేముంది స్టార్ డాటర్స్ ఎంట్రీ ఇస్తే మురిసిపోయే అభిమానులు ఇప్పుడు ఫుల్ జోష్ చూపిస్తున్నారు. మహేశ్ మాస్ స్టెప్పులకు తోడూ ఆయన కూతురు ఎంట్రీతోనే చేసిన డాన్స్.. ఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఫారిన్‌ లేడి గ్రూప్‌తో సూపర్ స్టార్ డ్యాన్స్‌ చేస్తుంటే.. మరో గ్రూప్‌ లీడ్‌ డ్యాన్స్‌ర్‌ గా సూపర్ డాటర్ స్టెప్పులేసింది. ఇలా తండ్రి కూతుళ్లను ఒకే పాటలో చూసి మహేశ్ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. మొత్తానికి సాంగ్ చాలా ఆక‌ట్టుకుంటుంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది