Allu Arjun : ఏం మహేష్ బాబు అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులు మరీ అంత ఎదవలా?
Allu Arjun : సినిమా ఇండస్ట్రీ లో హీరోలు మరియు వారి పాత్రలు ఎలివేట్ అవ్వడం కోసం యాక్షన్ సన్నివేశాల్లో కాస్త అతి చేస్తారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ యాక్షన్ సన్నివేశాల్లో ఒక్కసారే పది మందిని ఎగరవేసి మరి కొట్టడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి సన్నివేశాలు ఇంతకు ముందు ఎక్కువగా నడిచాయి. కానీ ఇప్పుడు అలాంటి యాక్షన్ సన్నివేశాలకు చాలా మంది పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు ఫైట్స్ చాలా న్యాచురల్ గా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని పలు సందర్భాల్లో నిరూపితమైంది. గతంలో మాదిరిగా తొడగొడితే ట్రైన్ వెనక్కు పోవడం, కోడి కాలికి కత్తి కట్టి ప్రాణాలు తీయడం వంటివి చేస్తే ప్రేక్షకులు ఇప్పుడు సినిమాలని తిరస్కరిస్తారని తెలిసిపోయింది.అందుకే హీరోలు చాలా జాగ్రత్తగా సినిమాలు, అందులో యాక్షన్ సన్నివేశాలను తీస్తున్నారు.
కానీ అదే హీరోలు కమర్షియల్ యాడ్ షూట్ విషయాల్లో మాత్రం లైట్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది. తాజాగా మహేష్ బాబు ఒక కూల్ డ్రింక్ యాడ్ లో నటించాడు. ఆ యాడ్ లో దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై నుండి బైక్ తో కిందికి దూకినట్లుగా చేశాడు. అది మరీ ఓవరాక్షన్ అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఇక నిన్న అల్లు అర్జున్ జొమాటో యాడ్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ యాడ్ లో అల్లు అర్జున్ యాక్షన్ సన్నివేశం షూటింగ్ లో పాల్గొంటూ ఉంటాడు. ఆ సందర్భంలో సుబ్బరాజును ఎగరవేసి మరి తంతాడు. అప్పుడు సుబ్బరాజు మాట్లాడుతూ బన్నీ త్వరగా కిందకి దించవా గోంగూర మటన్ తినాలని ఉంది. రెస్టారెంట్లు మూసేస్తారేమో అంటూ చాలా ఫన్నీగా అడుగుతాడు.ఇది సౌత్ సినిమా గురు కొద్దిసేపు అలాగే ఎగరాల్సిందే అంటూ సౌత్ సినిమా పరువు తీసేలా బన్నీ వ్యాఖ్యలు చేశాడు.

social media trolls on mahesh babu and allu arjun commercial ads
ఈ యాడ్ లు కూడా ప్రేక్షకులకు ఎగటు పుట్టే విధంగా ఉన్నాయంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. మరీ ఇంతగా ప్రేక్షకులను ఎదవలు చేయాలా అంటూ వారిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకముందు ఇలాంటి యాడ్ చేస్తే సోషల్ మీడియా లో మరింతగా ట్రోల్స్ చేసే అవకాశం ఉంటుంది అంటూ హెచ్చరించారు. ఈ హీరోలిద్దరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సక్సెస్ లు దక్కించుకుంటూ పెద్ద ఎత్తున కమర్షియల్ యాడ్స్ ఛాన్స్ లు దక్కించుకుంటూ, కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు నటిస్తున్నారు. కాని వీరు నటిస్తున్న కమర్షియల్ యాడ్స్ ఇలా నాసిరకంగా ఉండటంతో దురదృష్టకరం అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.