Allu Arjun : ఓ వైపు ప్రశంసలు.. మరోవైపు విమర్శలు.. అల్లు అర్జున్ నే మెయిన్ టాపిక్ అయ్యాడుగా..!
ప్రధానాంశాలు:
Allu Arjun : ఓ వైపు ప్రశంసలు.. మరోవైపు విమర్శలు.. అల్లు అర్జున్ నే మెయిన్ టాపిక్ అయ్యాడుగా..!
Allu Arjun : పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ కి ఎంతో పేరు తెచ్చి పెట్టే ప్రాజెక్ట్ అవుతుంది అనుకుంటే అతన్ని ఈ సినిమా అనుకోని సమస్యల్లో పడేసింది. పుష్ప 2 ప్రీమియర్స్ టైం లో జరిగిన తొక్కిసలాట వల్ల ఒక ప్రాణం పోయింది అంతేకాదు అక్కడ తొక్కిసలాటలో గాయపడ్డ ఒక బాబు ఇంకా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఇష్యూలో పోలీసులు ఒక వెర్షన్, అల్లు అర్జున్ మరో వెర్షన్ వినిపించారు. ఐతే అరెస్ట్ చేసి ఒక పూట జైలులో ఉన్న అల్లు అర్జున్ బెయిల్ మీద ఇంటికి వచ్చాడు. ఈ ఘటనలో తప్పెవరిది అన్నది పక్కన పెడితే వేళ్లనీ అల్లు అర్జున్ వైపే చూపిస్తున్నాయి. ఈ ఇష్యూ వల్ల ఇండస్ట్రీ తరపున కొందరు వ్యక్తులు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడారు. ఐతే దీనిపై తమ్మారెడ్డి భరధ్వాజ ఘాటు కామెంట్స్ చేశారు. ఒక్కరు చేసిన తప్పు వల్ల ఇండస్ట్రీ అంతా తలదించుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.
Allu Arjun జన సమీకరణ ఎక్కువ ఉన్నప్పుడు..
మరోపక్క ఈ ఇష్యూపై బడా నిర్మాత సురేష్ బాబు కూడా బయటకు వెళ్లే అవసరం లేనప్పుడు.. లేదా జన సమీకరణ ఎక్కువ ఉన్నప్పుడు వెళ్లకపోవడమే బెటర్ అని అన్నారు. అంతేకాదు మన ప్రవర్తనే దీన్ని సృష్టిస్తుందని.. జన ఎక్కువ ప్రదేశాల్లో జాగ్రత్త వహించాలి. నీ ఇంట్లో నువ్వు ఎగురు, డ్యాన్స్ చై ఏదైనా చెయ్యి కానీ బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలని అన్నారు. ఈ కామెంట్స్ సురేష్ బాబు అల్లు అర్జున్ ని ఉద్దేశించే అన్నారని చెప్పకనే చెప్పొచ్చు.
ఇలా ప్రస్తుతం జరిగిన ఘటనలో అల్లు అర్జున్ తప్పు ఉందని వీళ్లు విమర్శిస్తున్నారు. ఐతే ఇదిలాఉంటే మరోపక్క అల్లు అర్జున్ ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు బిగ్ బీ అమితాబ్. కౌన్ బనేగా కరోడ్ పతి షోలో హాట్ సీట్ లోని కంటెస్టెంట్ కి అల్లు అర్జున్, అమితాబ్ అంటే ఇష్టమని అనగా.. అమితాబ్ కూడా తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని.. తాను పొందుతున్న ప్రశంసలు అన్నిటికీ ఆయన అర్హుడని తనని అల్లు అర్జున్ తో పోల్చొద్దని అన్నారు. ఇక్కడ కొందరు జరిగిన ఘటనపై బన్నీ పై ఘాటు కామెంట్స్ చేస్తుంటే దీనికి సంబంధం లేకుండా అమితాబ్ బన్నీని మెచ్చుకోవడం వెరైటీగా ఉంది. Allu Arjun, Amitabh Bachchan, Suresh Babu, Tammareddy Bharadhwaja, Social Media