Sonu sood : రియల్ హీరో సోనూసూద్‌కు సమస్యలు..!
Sonu sood : సోనూసూద్ పలు సూపర్ హిట్ సినిమాలలో విలన్ పాత్రలు వేసి పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇండస్ట్రీకి గానీ ప్రేక్షకులకు గానీ కేవలం ఒక నటుడిగానే పరిచయమైన సోనూలో అపారమైన సమాజ సేవ చేసే గుణం ఉందని ఏ ఒక్కరు ఊహించలేకపోయారు. గత ఏడాది కరోనా కల్లోలంతో దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల ఆర్ధిక నష్టం ..లక్షల్లో ప్రాణ నష్టం జరిగింది. ఈ సమయంలో సినీ రాజకీయ నాయకులందరు […]
Sonu sood : సోనూసూద్ పలు సూపర్ హిట్ సినిమాలలో విలన్ పాత్రలు వేసి పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇండస్ట్రీకి గానీ ప్రేక్షకులకు గానీ కేవలం ఒక నటుడిగానే పరిచయమైన సోనూలో అపారమైన సమాజ సేవ చేసే గుణం ఉందని ఏ ఒక్కరు ఊహించలేకపోయారు. గత ఏడాది కరోనా కల్లోలంతో దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల ఆర్ధిక నష్టం ..లక్షల్లో ప్రాణ నష్టం జరిగింది. ఈ సమయంలో సినీ రాజకీయ నాయకులందరు స్పందించిన సంగతి తెలిసిందే. కానీ సోనూసూద్ మాత్రం సేవ చేసేందుకు నడుం బిగించాడు.
గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఎక్కడివారు అక్కడే స్థంభించిపోతే వారిని సొంత ఊళ్ళకి చేర్చాడు. ఎంతో మందికి ఉపాది కల్పించాడు. అప్పటి నుంచి సేవ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ప్రజల దృష్టిలో సోనూసూద్ దేవుడయ్యాడు. ఇక ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభించింది. ఆక్సిజన్ లేక ప్రాణాలు పోతున్నాయి. దాంతో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాడు. చికిత్సలకు తగు సదుపాయాలు కల్పిస్తున్నాడు. ఎంతో మందికి మందులు సరఫరా చేస్తున్నాడు.
Sonu sood : సోనూసూద్ సరఫరా చేస్తున్న మందులు ఎక్కడి నుంచి వచ్చాయి..?
అయితే సోనూసూద్ సరఫరా చేస్తున్న మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంలో ఆయనకి నోటీసులు వచ్చాయట. కోవిడ్ డ్రగ్స్ పై అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నట్లు హైకోర్టు తెలియజేయగా.. ప్రజలందరికీ మంచి చేయాలన్న ఆలోచన ఉత్తమైనదే.. అయితే, కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉన్న ఈ కోవిడ్ డ్రగ్స్ వారికి ఎక్కడి నుంచి లభిస్తున్నాయో తెలుసుకోవాలని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ముంబై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ సిద్ధికి, అలాగే నటుడు సోనుసూద్ చారిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.