South Stars Squid Game : మహేష్ బాబు, ఎన్టీఆర్ తో పాటు మిగతా సౌత్ స్టార్స్ స్క్విడ్ గేమ్ ఆడితే.. వీడియో చూసి షాక్ అవ్వాల్సిందే..!
ప్రధానాంశాలు:
South Stars Squid Game : మహేష్ బాబు, ఎన్టీఆర్ తో పాటు మిగతా సౌత్ స్టార్స్ స్క్విడ్ గేమ్ ఆడితే.. వీడియో చూసి షాక్ అవ్వాల్సిందే..!
South Stars Squid Game : కొరియన్ వెబ్ సీరీస్ స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఈ వెబ్ సీరీస్ సీజన్ 1 సూపర్ హిట్ కాగా దానికి సీక్వెల్ గా స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్క్విడ్ గేమ్ Squid Game సీజన్ 1 ని మించి సీజన్ 2 లేదు కానీ ఆ సీరీస్ ని అభిమానించే ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. ఇదిలాఉంటే స్క్విడ్ గేమ్ ప్రచారం బాగా పెరగడంతో దీనిపై రకరకాల వీడియోస్ వస్తున్నాయి. లేటెస్ట్ గా ఏ.ఐ జెనరేటెడ్ వీడియో ఒకటి సౌత్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది.
South Stars Squid Game స్క్విడ్ గేమ్ ని మన సౌత్ ఇండియా సూపర్ స్టార్స్
స్క్విడ్ గేమ్ ని మన సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ South Stars ఆడితే ఎలా ఉంటుంది. అహా ఆ ఊహే ఒక రేంజ్ లో ఉంది కదా అలాంటి ఒక ఆలోచన ఒక క్రియేటర్ కి వచ్చింది. స్క్విడ్ గేమ్ లో సౌత్ స్టార్స్ ని ఆడిస్తే ఎలా ఉంటుందో ఒక ఏ.ఐ జనరేటెడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ.ఐ ని ఎలా వాడాలో అంతకుమించి వాడేస్తున్నారు. స్క్విడ్ గేమ్ లో సౌత్ స్టార్స్ తెలుగు నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh Babu,, ఎన్టీఆర్ Jr NTR, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కోలీవుడ్ నుంచి విజయ్, సూర్య, విక్రం, మలయాళం నుంచి దుల్కర్ సల్మాన్, మోహన్ లాల్, మమ్ముట్టి కన్నడ నుంచి యష్ ఇలా అన్ని పరిశ్రమలను కవర్ చేశారు.
ఈ వీడియో సౌత్ హీరోల ఫ్యాన్స్ అందరికీ సూపర్ కిక్ ఇస్తుంది. స్క్విడ్ గేమ్ డ్రస్ లో సౌత్ స్టార్స్ భలే ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్క్విడ్ గేమ్ కి స్టార్ కలరింగ్ అవసరం లేదు. ఆ కాన్సెప్టే సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఇలాంటి ఒక సీరీస్ మన ఇండియన్ మేకర్స్ కూడా తీస్తే అదిరిపోతుందని అంటున్నారు. స్క్విడ్ గేమ్ ని ఇండియన్ సినీ లవర్స్ కూడా బాగా ఆదరించారు. నెట్ ఫ్లిక్స్ లో స్క్విడ్ గేమ్ టాప్ ట్రెండింగ్ లో ఉంటుంది అంటే అది మన ఇండియన్ ఆడియన్స్ కూడా చూస్తున్నారని చెప్పొచ్చు.