Sreeja Konidela : వామ్మో మెగా డాటర్స్ కూడా మొదలుపెట్టేశారా?.. అక్కడ శ్రీజ, సుష్మితల సందడి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreeja Konidela : వామ్మో మెగా డాటర్స్ కూడా మొదలుపెట్టేశారా?.. అక్కడ శ్రీజ, సుష్మితల సందడి

 Authored By aruna | The Telugu News | Updated on :27 September 2022,4:30 pm

Sreeja Konidela : మెగా డాటర్స్ శ్రీజ కొణిదెల, సుష్మిత కొణిదెల, అమల అక్కినేని వంటి వారు సహజంగా బయట ఎక్కువగా కనిపించరు. ఇక ప్రమోషనల్ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వంటివి చేయరు. కానీ మొదటి సారిగా శ్రీజ, సుష్మిత, అమల వంటి వారు ఓ షాపింగ్ మాల్‌ను ఓపెన్ చేశారు. కళామందిర్ రాయల్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ ముగ్గురూ సందడి చేశారు. హైదరాబాద్ లో “కళామందిర్ రాయల్” బ్రాండ్ ఘనంగా ప్రారంభం అయింది. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 36లో ఇది అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రముఖ నటి, సామాజిక వేత్త అమల అక్కినేని, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల స్టోర్ ప్రారంభించారు.

వీరితో పాటు ఈ కార్యక్రమంలో దివ్య రెడ్డి, దీపికా రెడ్డి, పద్మజ ల్యాంకో, శుభ్ర మహేశ్వరి, కల్పన తదితరులు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో చీరల రిటైల్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన బ్రాండ్ కళామందిర్. ఇది ఇప్పుడు జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.36లో తన కొత్త ప్రీమియం బ్రాండ్ “కళామందిర్ రాయల్” గ్రూప్ 49వ షోరూమ్‌తో ముందుకు వచ్చింది. కొత్త బ్రాండ్ కళామందిర్ కి అప్‌ గ్రేడ్ వెర్షన్. ఇది ఎంపిక చేసిన ప్రత్యేకమైన పట్టు సేకరణకు ప్రసిద్ధి చెందింది. కళామందిర్ రాయల్ అనేది చేతితో ఎంపిక చేసిన పట్టు, పైథాని, పటోలా, చేనేత, కోటా, డిజైనర్, ఖాదీ చీరల కోసం ఒక సరికొత్త స్టోర్. కొత్త స్టోర్ ఒక రకమైన ప్రీమియం ఎలివేషన్ మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇంటీరియర్‌లను ఆకర్షణీయంగా కలిగి వుంటుంది.

Sreeja And Sushmitha Konidela in Kalamandir Royal Shop opening

Sreeja And Sushmitha Konidela in Kalamandir Royal Shop opening

ఈ సందర్భంగా కళామందిర్ రాయల్ డైరెక్టర్ కళామందిర్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కళామందిర్ రాయల్ దివ్యమైన ప్రదేశమని, నేటి మహిళా ప్రమాణాలకు తగ్గట్టుగా అత్యంత నిశితంగా, అపూర్వంగా రూపొందించిన ఉత్పత్తులు కళామందిర్ రాయల్ మొదటి స్థానంలో నిలుస్తాయన్నారు. ప్రత్యేకమైన, ప్రత్యేకమైన చీరల సేకరణను ఇష్టపడే నగర మహిళల కోసం ఈ స్టోర్ ఏర్పాటు చేశామ’ని అన్నారు. ఇక ఇలా మెగా డాటర్లు వచ్చి షోరూంను ఓపెన్ చేయడంతో.. అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో శ్రీజ, సుష్మిత చేసిన సందడి, వాటికి సంబంధించిన ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మామూలుగా అయితే హీరోయిన్లు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతుంటారు. మొదటి సారిగా మెగా డాటర్లు ఇలా మెరిశారు.

Sreeja And Sushmitha Konidela in Kalamandir Royal Shop opening

Sreeja And Sushmitha Konidela in Kalamandir Royal Shop opening

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది