sreeleela gets crazy offers
Sreeleela : ఈ మధ్య టాలీవుడ్‌లో కుర్ర భామల హంగామా ఎక్కువగా ఉంది.కృతి శెట్టి, శ్రీ లీల వంటి వారు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన చిన్నది శ్రీలీల. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కన్నడలో పలు సినిమాల్లో నటించిన శ్రీలీలమొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. స్టార్ హీరోల సరసన మంచి పాత్రలు దక్కుతున్నాయి. రెండవ సినిమానే రవితేజ సరసన చేస్తున్న ఈ భామ, ఆ తరువాత వైష్ణవ్ తేజ్.. నవీన్ పోలిశెట్టి సినిమాలను కూడా లైన్లో పెట్టేసింది.
వైష్ణవ్ తేజ్.. నవీన్ పోలిశెట్టి లాంటి క్రేజీ హీరోల సినిమాలకు కమిటైంది ఈ బ్యూటీ. నందమూరి బాలకృష్ణ- అనీల్ రావిపూడి మూవీ కోసం శ్రీలీలను సంప్రదించారట. నటసింహాకు కూతురి పాత్ర అని టాక్ . ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది. పూజ చెల్లెలిగా శ్రీలీల కనిపించనుందని తెలుస్తుంది . ఈ అమ్ముడు రెమ్యునరేషన్ రూ. 70లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది.
sreeleela gets crazy offers
నితిన్ సినిమాలోను ఈ అమ్మడు కథానాయికగా నటిస్తుందని టాక్. యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచెర్ల నియోజకవర్గం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే నితిన్ చేయబోయే కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీతో నితిన్ నెక్ట్స్ ప్రాజెక్టు ఉండబోతుందని టాక్ నడుస్తోంది. కాగా ఈ చిత్రంలో బెంగళూరు బ్యూటీ, పెళ్లిసందD ఫేం శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించనుందట. ఈ చిత్రానికి జూనియర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఇన్ సైడ్ టాక్. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై నిర్మించబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని ఇన్‌సైడ్ టాక్.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.