Sreemukhi : ఏదో ఊపమంటే ఇంకేదో ఊపుతున్నాడట.. పరువుదీసేసిన శ్రీముఖి
Sreemukhi : బుల్లితెరపై శ్రీముఖి చేసే రచ్చ అందరికీ తెలిసిందే. అయితే కెమెరా ముందు ఎలా ఉంటుందో.. కెమెరా వెనుక కూడా అంతే సరదాగా ఉంటుంది. శ్రీముఖి పటాస్ షో చేస్తున్న సమయంలో కంటెస్టెంట్లపై ఎంతగా సెటైర్లు వేసేదో అందరికీ తెలిసిందే. అక్కడ అలా ఎక్స్‌ప్రెస్ హరి అనే ఆర్టిస్ట్ శ్రీముఖి స్నేహితుడిగా మారాడు. అంతే కాకుండా బొమ్మ అదిరింది షోలోనూ ఎక్స్ ప్రెస్ హరిని ఓ రేంజ్‌లో ఆడుకునేది.
తాజాగా శ్రీముఖి గ్యాంగ్, విష్ణుప్రియ గ్యాంగ్ అంటూ తగువులు పెట్టేందుకు సుమ రెడీ అయింది. స్టార్ట్ మ్యూజిక్ అనే షోను ఇప్పుడు సుమ నడిస్తోన్న విషయం తెలిసిందే. అంతకుముందు శ్రీముఖి ఈ షోకు హోస్ట్. అయితే ఇదే విషయాన్ని చెబుతూ.. ఇది నా అడ్డా అంటూ శ్రీముఖి బిల్డప్ ఇచ్చింది. తనతో పాటు తన తోకలైన ఎక్స్‌ప్రెస్ హరి, ఢీ డ్యాన్సర్ పండును తీసుకొచ్చింది. ఇక ఈ గ్యాంగ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.

Sreemukhi on Express Hari in Suma Start Music
Sreemukhi : పరువుదీసేసిన శ్రీముఖి
ఇక సుమ ఎంట్రీ ఇవ్వడంతోనే అందరూ తోకముడిచారు. అయితే స్టార్ట్ మ్యూజిక్ ఆటలో భాగంగా శ్రీముఖి గ్యాంగ్ ఓ టాస్క్ చేసినట్టుంది. అందులో భాగంగా ఈ ముగ్గురూ డ్యాన్స్ చేశారు. అయితే హరి కాస్త తేడాగా డ్యాన్స్ చేస్తుండటంతో.. ఒరేయ్ నేను వీడ్ని ఏదో ఊపమంటే ఇంకేదో ఊపుతున్నాడురా? అంటూ అతని పరువుతీసేసింది శ్రీముఖి. అలా అనడంతో అందరూ పగలబడి నవ్వేశారు. ఇక మరో వైపు విష్ణుప్రియ గ్యాంగ్‌లో ఆర్జే చైతూ కూడా దుమ్ములేపాడు.
Friends opposite teams lo set ayyi gola chesthe oo range lo untundi ???? #StartMusic Sunday at 12 PM on @StarMaa #SundayFunday pic.twitter.com/CtVMEfhMHv
— starmaa (@StarMaa) February 18, 2021