Sri Reddy : శ్రీ రెడ్డి స్టైల్‌లో బోటి కూర.. తింటే ఉంటుంది నా సామిరంగా..!
Sri Reddy : కాస్టింగ్ కౌచ్‌తో వార్తలలోకి ఎక్కిన శ్రీ రెడ్డి ఇటీవల వంటకాలతో అదరగొడుతుంది. శ్రీరెడ్డి అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి హోం టూర్, బెడ్ రూమ్ టూర్ లతోపాటు వంటలు చేస్తూ అందాలను కొసరుగా వడ్డిస్తుంది. వంటలు చేసేటప్పుడు కొసరు కొసరు అందాలను చూపిస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది. తాజాగా తెలంగాణ స్టైల్‌లో బోటికూర చేసింది. ఇది చేయడం చాలా కష్టమైన తన అభిమానుల కోసం చేశానని అంటుంది. వర్షం వలన చేయాల్సిన లొకేషన్‌లో చేయలేకపోయిన కూడా ఎలాగోలా బోటికూరని అద్భుతంగా వండి రుచి చూసింది. శ్రీ రెడ్డి వంటకాలను చూసి నెటిజన్స్ థ్రిల్ అవుతున్నారు. తాజాగా బోటికూర వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
ఇటీవల కాలంలో శ్రీరెడ్డి వంటలు నేర్పిస్తూ పల్లెటూరి చీరకట్టులో అందాలను వడ్డిస్తుంటే ఆ వంటకాల వీడియోలకు భారీ రెస్పాన్స్ వస్తుంది. పాత సినిమాల్లోని జయమాలినీ, జ్యోతి లక్ష్మిలు గుర్తుకు చేస్తూ మరీ రెచ్చిపోతుంది. ఏదేమైన శ్రీ రెడ్డి తనదైనశైలిలో దూసుకుపోతుందనే చెప్పాలి. తన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్‌ను దక్కించుకింది. దానికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ వివాదాస్పద విషయాల కారణంగా రచ్చ చేస్తుండడమే. తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదలే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడు బాత్‌రూం ఫొటోలు కూడా వదులుతుంటుంది.
Sri Reddy : ఆహా.. ఏమి రుచి!
మోడల్ గా మారిన తరువాత ఆమె ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ లాంటి సినిమాల్లో లీడ్ రోల్స్ చేసినా ఆమెకు తగిన గుర్తింపు అయితే దక్కలేదు అనే చెప్పాలి. మళ్ళీ వెలుగులోకి రావాలని కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అవకాశాలు ఇస్తామని రానా తమ్ముడు అభిరాం మొదలు హీరో నాని దాకా చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఈమె చేసిన రచ్చకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బహిష్కరించగా, చెన్నైలో పడింది . అక్కడ ఉండి సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులని కూడా అలరిస్తుంది.
