Balakrishna : బాల‌య్య మ్యాన్ష‌న్ హౌజ్ స్టోరీ బ‌య‌ట‌పెట్టిన బాల‌య్య అల్లుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : బాల‌య్య మ్యాన్ష‌న్ హౌజ్ స్టోరీ బ‌య‌ట‌పెట్టిన బాల‌య్య అల్లుడు

 Authored By ramu | The Telugu News | Updated on :2 May 2024,12:00 pm

Balakrishna  : నంద‌మూరి అంద‌గాడు బాల‌కృష్ణ ఇప్ప‌టికీ కుర్రాడి మాదిరిగా సినిమాలు చేస్తున్నాడు.ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలతో బిజీగా ఉన్నారు. బాల‌య్య ఏ విష‌యాన్నైన ముక్కుసూటిగా మాట్లాడ‌తాడు. అలానే త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని బ‌హిర్గ‌తంగానే ఉంచుతాడు. ఇక బాలయ్యకు మద్యం అలవాటు ఉందనే విషయం మ‌నంద‌రికి తెలిసిందే. అత‌ను కూడా కొన్ని సార్లు మ‌ద్యం గురించి ఓపెన్‌గా మాట్లాడారు. అన్ స్టాపబుల్ షో కు హాజరైన అతిథులతో మద్యం ప్రస్తావన తెచ్చేవారు. సాయంత్రం అయిందంటే చాలు ఓ పెగ్ వేయాల్సిందే అన్నట్లు ఆయ‌న అనేవారు. ఇక బాల‌య్య ఏ మందు తాగుతారు అనే విష‌యం అంద‌రికి తెలుసు.

Balakrishna  : బాల‌య్య సీక్రెట్..

2019 ఎన్నికల సమయంలో బాలయ్యమీద మెగా బ్రదర్ నాగబాబు వరుసగా వీడియోలు విడుదల చేశారు. బాలకృష్ణ ఇమేజ్ దెబ్బతీసేలా సోషల్ మీడియా చాట్ లో మా బ్లడ్ వేరు.. మా బ్రాండ్ వేరు.. కామెంట్ పెట్టి మ్యాన్షన్ హౌస్ సీసాను జోడించాడు. అప్పుడు కూడా బాల‌య్య మ్యాన్షన్ హౌజ్ తాగుతాడ‌ని అంద‌రికి అర్ధ‌మైంది. అయితే చాలా మంది బాల‌య్య‌ని మ్యాన్షన్ హౌజ్‌కి బ్రాండ్‌గా చెబుతుంటారు. తాజాగా బాల‌య్య అల్లుడు శ్రీభరత్ ఓ ఇంటర్వ్యూలో త‌న మావ‌య్య మామయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతాడని చెప్పారు. ఆయ‌న అలా తాగుతార‌ని తెలిసిన తర్వాత ఆ కంపెనీ స్టాక్ విలువ పెరిగిందన్నారు. వేడినీళ్లల్లో కలుపుకొని తాగుతారంటకదా అని యాంకర్ అడగ్గా.. అవును అది నిజం అన్నారు భరత్.

Balakrishna బాల‌య్య మ్యాన్ష‌న్ హౌజ్ స్టోరీ బ‌య‌ట‌పెట్టిన బాల‌య్య అల్లుడు

Balakrishna : బాల‌య్య మ్యాన్ష‌న్ హౌజ్ స్టోరీ బ‌య‌ట‌పెట్టిన బాల‌య్య అల్లుడు

బాలయ్య దగ్గర ఎప్పుడూ ఓ బ్యాగ్ ఉంటుందని, అందులో మందు సీసాతోపాటు వేడినీళ్లు కూడా ఉంటాయని, ఎక్కడకు వెళ్లినా ఆ బ్యాగ్ ఉండాల్సిందే. అమెరికా వెళ్లినా దాన్ని వెంట తీసుకువెళతారని భరత్ చెప్పారు అమెరికా వెళ్లినా తీసుకెళ్తారన్నారు. ఇక నందమూరి బాలకృష్ణ రెండో అల్లడు, గీతం విద్యాసంస్థల అధినేత.. మతుకుమిల్లి శ్రీభరత్ విశాఖ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే..2019లోనూ విశాఖ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన భరత్.. 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన మరోసారి తన అదృష్టం ప‌రీక్ష‌ చేసుకోబోతున్నారు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది