Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీలో అది మిస్.. ఇలా అయితే కష్టం
Sridevi Drama Company : జబర్దస్త్ కార్యక్రమం సూపర్ హిట్ అవ్వడంతో అందులోని కమెడియన్స్ తో ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో ని తీసుకు వస్తున్నారు. మొదట ఈ షో కోసం మంచి మంచి కాన్సెప్ట్ లు తీసుకు వచ్చేవారు. కానీ గత కొన్ని వారాలుగా కనీసం కాన్సెప్ట్ ఏమీ లేకుండా షో ను సోది సోది అన్నట్లుగా నిర్వహిస్తున్నారు. కాస్త కామెడీ.. కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటున్నాయి కానీ షో కి మెయిన్ కాన్సెప్ట్ అనేది లేకపోవడంతో ప్రేక్షకులు షో పై ఆసక్తి చూపడం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు శ్రీదేవి డ్రామా కంపెనీ బోర్ కొట్టేలా చేస్తున్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి.
నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో సదాను తీసుకు వచ్చి రాను రాను అంటూనే చిన్నదో అంటూ ఏదో కాన్సెప్ట్ మొదలు పెట్టారు. కానీ షో జరిగింది మొత్తం వేరే విషయం. ఇంతకు ముందు ఒక కాన్సెప్ట్ అనుకుని షో మొత్తం కూడా ఆ కాన్సెప్ట్ తిప్పే వారు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాకుండా ఇష్టానుసారంగా కామెడీ చేస్తూ నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నవ్వించడం కంటే కాస్త కంటెంట్ ఉంటే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కంటెంట్ లేకుండా కాన్సెప్ట్ లేకుండా ఏదో కామెడీ చేశాం అన్నట్లుగా వస్తే ముందు ముందు మరింతగా రేటింగ్ పడిపోయే అవకాశం ఉంది అంటూ బుల్లి తెర వర్గాల వారితో పాటు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇలాంటి షో లు ఎన్నో వస్తున్నాయి. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీనే ప్రేక్షకులు ఎందుకు చూస్తున్నారు అంటే ఒక మంచి కంటెంట్ తో పాటు మంచి కాన్సెప్ట్ సినిమాలో ఉంటుంది. అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ తగ్గుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అయితే షో ని ఏకంగా మూసి వేయాల్సి రావచ్చు అంటూ హెచ్చరిస్తున్నారు.