Rajamouli : ఒక్క సినిమా కోసం ఆస్తులు అడుగుతున్న సుకుమార్, త్రివిక్రమ్ .. రాజమౌళి నే చాల బెటర్ రా బాబు ..!!
Rajamouli : టాలీవుడ్ లో స్టార్ హీరోలకి ఉన్న క్రేజ్ డైరెక్టర్ లకు కూడా ఉంటుంది. ఒక్క సినిమా హిట్ అయితే డైరెక్టర్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. హీరోలకు ఎంత రెమ్యూనరేషన్ ఉంటుందో డైరెక్టర్స్ కి కూడా అదే రేంజ్ లో పారితోషికం ఉంటుంది. ఇక మన టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు రాజమౌళి ‘ బాహుబలి ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ క్రేజ్ ఇంకా పెరిగింది. రాజమౌళి రెమ్యూనరేషన్ తో పాటు సినిమా లాభాల్లో వాటా తీసుకుంటారు. పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి అది అంచనా వేయడం కూడా కష్టమే.
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రాజమౌళి దాదాపు రూ. 100 కోట్ల పారితోషికం తీసుకున్నాడని సమాచారం. ఇక రాజమౌళి తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అల్లు అర్జున్ తో అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాక రెమ్యూనరేషన్ పెంచాడు. ఒక్కో సినిమాకు 30 కోట్లు తీసుకుంటాడు. దీంతోపాటు బిజినెస్ వాటాలో కూడా కొంచెం తీసుకుంటాడు. ఇక సుకుమార్ రంగస్థలం సినిమా చేశాక తన రేట్ ను పెంచాడు. ప్రస్తుతం 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాక 23 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే కొరటాల శివ ఆచార్య సినిమాకి 20 కోట్లు పారితోషికం తీసుకున్నాడు.
ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ తన డిమాండ్ ఏం తగ్గలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకి 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. వినయ విధేయ రామ వరకు మంచి ఫేమ్ లో ఉన్న బోయపాటి శ్రీను అప్పటివరకు 10 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఆ తర్వాత ప్లాప్స్ రావడం తో రెమ్యూనరేషన్ తగ్గించాడట. ఇటీవల మళ్ళీ అఖండ విజయంతో రెమ్యూనరేషన్ పెంచేసాడు. పూరి జగన్నాథ్ ఒక్కో సినిమాకి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఒక్కో సినిమాకు 10 కోట్లు తీసుకుంటున్నారు.