Extra Jabardasth : ఎక్స్ ట్రా జబర్దస్త్‌ను వీడనున్న ముగ్గురు!.. స్టేజ్ మీద చెప్పిన సుధీర్, శ్రీను, రాం ప్రసాద్
Extra Jabardasth : జబర్దస్త్ షో గురించి గత కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ వెళ్లిపోతోన్నాడని, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు గుడ్ బై చెబుతున్నాడని, సుధీర్ వెళ్లిపోతోండటంతో.. గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కూడా వీడుతున్నారని రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై గెటప్ శ్రీను స్పందించాడు. రూమర్లను ఖండిస్తూ సెటైర్లు వేశాడు.
అయితే తాజాగా అందరి ముందు ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చేందుకు ట్రై చేశారు. అది కూడా ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ మీదే. రోజా, మనోలు చూస్తుండగానే. అయితే ప్రోమో ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రోమోకు ఎపిసోడ్‌కు అస్సలు సంబంధం ఉండదు. ఏదో జరిగిపోతోందన్నట్టుగా చూపిస్తారు. కానీ అందులో ఏమీ ఉండదు. తాజాగా వదిలిన ప్రోమో కూడా అంతే.

Sudheer Getup Srinu And Ram Prasad Skit On Quitting Extra Jabardasth
Extra Jabardasth : రూమర్లపై సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ స్కిట్
తాము ఇన్ని రోజులు జబర్దస్త్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్నాం.. కానీ మమ్మల్ని క్షమించండి.. మేం ముగ్గురం అంటూ తెగ నటించేశారు. అంటే వారిపై వచ్చిన రూమర్లపై వారే స్కిట్లు వేసినట్టున్నారు. జబర్దస్త్ షోను వీడిపోతోన్నామనే రూమర్లపై ఇలా సెటైర్లు వేసినట్టున్నారు. మొత్తానికి జబర్దస్త్ షోను వీడిపోయేది లేదు అని ఇలా పరోక్షంగా చెప్పినట్టు కనిపిస్తోంది.
