Sudheer – Anasuya : సుధీర్‌, అనసూయ, చమ్మక్ చంద్ర.. వెళ్లి పోయిన వాళ్లంతా మళ్లీ ఈటీవీకి వచ్చారు!

Authored By aruna | The Telugu News | Published on: August 24, 2022, 6:20 pm

Sudheer – Anasuya : ఒక్క సారి జబర్దస్త్‌ నుండి కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి కానీ పక్క ఛానల్‌ కు వెళ్ల పోయిన వారు తిరిగి రావాలి అనుకున్నా కూడా రావడం సాధ్యం కాదు. గతంలో ఎంతో మంది జబర్దస్త్‌ ను వీడి తప్పు చేశాం మళ్లీ వస్తాం అంటూ విజ్ఞప్తి చేసినా కూడా నిర్మొహమాటంగా కాదు.. లేదు అన్నారట. ఇప్పుడు మాత్రం జబర్దస్త్‌ నుండి వెళ్లి పోయిన సుడిగాలి సుధీర్‌.. అనసూయ.. చమ్మక్‌ చంద్ర ఇంకా చాలా మందిని ఈటీవీ మరియు మల్లెమాల స్వయంగా పిలిచింది. వారితో ఒక కార్యక్రమం చేయడం ద్వారా ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది. చాలా కాలం తర్వాత ఇలాంటి కార్యక్రమం రాబోతున్న నేపథ్యంలో అంతా కూడా హ్యాపీగా ఉన్నారు.

అయితే రెగ్యులర్ జబర్దస్త్‌.. శ్రీదేవి డ్రామా కంపెనీ లో వారు కనిపించలేదు. వారు కనిపించబోతున్న కార్యక్రమం ఈటీవీ 27వ వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం. ఆ సందర్భంగా గతంలో ఈటీవీతో అనుబంధం ఉన్న వారు అందరిని కూడా ఆహ్వానించారు. కార్యక్రమంను మల్లెమాల వారు నిర్వహించారు. వారు ఈటీవీ వార్షికోత్సవం సందర్భంగా పోయిన వారు మళ్లీ వస్తే బాగుంటుందని అనుకున్నారు. అయితే ఆ ఎపిసోడ్ వరకే అనేది ప్రతి ఒక్కరి మాట. తాజాగా ప్రోమో విడుదల అయ్యింది. సుధీర్‌ ను వెళ్లి పోయి మళ్లీ వచ్చావు అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఫన్‌ క్రియేట్‌ చేసే ప్రయత్నం చేశారు.

sudigali sudheer anasuya chammak chandra are back to etv event

sudigali sudheer anasuya chammak chandra are back to etv event

ఇతర ఛానల్స్ కు వెళ్లిన అనసూయ, సుధీర్‌ చమ్మక్ చంద్ర ఇంకా పలువురు ఈటీవీలో కనిపించడంతో ప్రేక్షకులు సర్‌ ప్రైజ్ అవ్వబోతున్నారు. ఇప్పటికే ప్రోమో రిలీజ్ అవ్వడంతో ఆ ఎపిసోడ్‌ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్‌ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారంలో టెలికాస్ట్‌ అవ్వబోతున్న ఆ ఎపిసోడ్‌ కు పాత కంటెస్టెంట్స్ తిరిగి వచ్చిన కారణంగా భారీ ఎత్తున రేటింగ్‌ నమోదు అయ్యే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తిరిగి వచ్చిన వీరు జబర్దస్త్‌ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కొనసాగితే బాగుంటుందని కొందరు ఆశ పడుతున్నారు. కానీ అది సాధ్యం కాదని మల్లెమాల వారు అంటున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp