Anasuya – Sudheer : సుధీర్ చేతిలో పది రూపాయలు పెట్టిన అనసూయ.. ఇది మరీ ఓవర్ యాక్షన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya – Sudheer : సుధీర్ చేతిలో పది రూపాయలు పెట్టిన అనసూయ.. ఇది మరీ ఓవర్ యాక్షన్

Anasuya – Sudheer : షో ఏదైనా సరే.. సుధీర్ ఉంటే చాలు అనుకునే అభిమానులున్నారు. సుధీర్ ఉంటే చాలు ఆ షో హిట్ అవుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంది. సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. సుధీర్ ఇన్నాళ్లు ఈటీవీ, జబర్దస్త్, మల్లెమాల అంటూ అక్కడే తిరుగుతూ వచ్చాడు. సుధీర్ ఢీ చేసినా, శ్రీదేవీ డ్రామా కంపెనీ చేసినా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. సుధీర్ పేరు అలా ఎప్పుడూ మార్మోగిపోతూనే ఉంటుంది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 August 2022,12:40 pm

Anasuya – Sudheer : షో ఏదైనా సరే.. సుధీర్ ఉంటే చాలు అనుకునే అభిమానులున్నారు. సుధీర్ ఉంటే చాలు ఆ షో హిట్ అవుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంది. సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. సుధీర్ ఇన్నాళ్లు ఈటీవీ, జబర్దస్త్, మల్లెమాల అంటూ అక్కడే తిరుగుతూ వచ్చాడు. సుధీర్ ఢీ చేసినా, శ్రీదేవీ డ్రామా కంపెనీ చేసినా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. సుధీర్ పేరు అలా ఎప్పుడూ మార్మోగిపోతూనే ఉంటుంది. సుధీర్ అంటే బుల్లితెరపై తిరుగులేని స్టార్‌గా నిలిచాడు. అయితే అలాంటి సుధీర్.. స్టార్ మాలోకి వచ్చాడు. స్టార్ మాలో సింగింగ్ షోలో హోస్టింగ్ చేస్తున్నాడు.

సుధీర్ వచ్చినంత మాత్రాన ఆ షో హిట్ అయిందా? అంటే లేదు. సుధీర్ స్థాయిని కూడా వారు దిగజార్చుతున్నారు. సుధీర్ మీద అనవసరపు పంచ్‌లు, సెటైర్లు వేస్తున్నారు. తాజాగా హేమచంద్ర, అనసూయ, మనో ఇలా అందరూ కలిసి సుధీర్ మీద కౌంటర్లు వేస్తూ వచ్చారు. సింగింగ్ షోలో హరిప్రియకు, సుధీర్‌కు మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని బాగానే ట్రై చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం సుధీర్‌ను అన్నయ్య అని పిలుస్తోంది.

Sudigali Sudheer Anasuya Hema Chandra Fun in Star Maa Singing Show

Sudigali Sudheer Anasuya Hema Chandra Fun in Star Maa Singing Show

ఆమెను ఇంప్రెస్ చేయాలంటే హేమచంద్రతో పాట పాడించి ప్రపోజ్ చేయించాలని సుధీర్‌కు టాస్క్ ఇచ్చింది అనసూయ. ఇక సుదీర్ ప్రపోజ్ చేసేందుకు రెడీగా ఉంటే.. ఏవేవో పిచ్చి పాటలు పాడి చెడదొబ్బుతుంటారు. అలా సుధీర్‌ను ఆమె ముందు బక్రాను చేసేస్తుంటారు. చివర్లో సుధీర్ చేతిలో అనసూయ పది రూపాయలు పెట్టి వెళ్లమంటుంది. ఇదంతా కూడా కామెడీ అని అనుకోవాలేమో. నవ్వించేందుకు వారంతా తెగ ప్రయాస పడ్డట్టు అనిపిస్తోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది