Sudigali Sudheer : సుధీర్ ఇంట్లో వెల్లివిరిసిన సంతోషం.. పాప పుట్టిందని చెప్పిన సుడిగాలోడు

Authored By aruna | The Telugu News | Published on: September 26, 2022, 5:30 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ విషయాలు ఎక్కువగా బయటకు రావు. సుధీర్ ఎక్కువగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాడు. కానీ అప్పుడప్పుడు సుధీర్ తన ఫ్యామిలీని మల్లెమాల చేసే ఈవెంట్లకు పట్టుకొస్తుంటాడు. అలా పండుగ ఈవెంట్లకు కొన్ని సార్లు తన ఫ్యామిలీని తీసుకొచ్చాడు. ప్రేక్షకులకు పరిచయం చేశాడు. సుధీర్ తల్లిదండ్రులు, తమ్ముడు, తమ్ముడి భార్యను ఇలా అందరినీ పరిచయం చేశాడు. తన తమ్ముడు ముందే పెళ్లి చేసుకున్నాడని, లవ్ మ్యారేజ్ అంటూ ఇలా సుధీర్ తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చాడు. ఇక సుధీర్ తమ్ముడి భార్య అయితే సుధీర్ గురించి ఎంతో గొప్పగా చెబుతుంది. ఓ బావగారిలా కాకుండా..

అన్నలా ఉంటాడని, తనను, ఫ్యామిలీని ఎంతో బాగా చూసుకుంటాడని చెబుతుంటుంది. ఇక సుధీర్ గురించి ఆవిడ ఎంతోగొప్పగా చెబుతుంది. అలా సుధీర్‌ను పొగిడిన తీరుతో సుధీర్ మరదలిగా ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఆమె కూడా ఓ యూట్యూబ్ చానెల్ పెట్టేసింది. వంటలు చేయడం, ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఆమె ఎంతో నేర్పరి. విష్ణుప్రియ వంటి వారికి కూడా ఆమె డిజైన్ చేస్తుంటుంది. ఆ మధ్య సుధీర్ మరదలితో విష్ణుప్రియ చేసిన ఓ యూట్యూబ్ వీడియో బాగానే వైరల్ అయింది. అందులో సుధీర్ ఫ్యామిలీ గురించి విష్ణుప్రియ ఎన్నో విషయాలు చెప్పింది. తాను సుధీర్ ఫ్యామిలీతో ఎంత క్లోజ్‌గా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసింది.

Sudigali Sudheer Brother Blessed with baby Girl

Sudigali Sudheer Brother Blessed with baby Girl

ఇక సుధీర్ మరదలితోనూ విష్ణుప్రియ ఎంతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుందట. ఇక ఇప్పుడు సుధీర్ తన ఫ్యామిలీ గురించి ఓ విషయం చెప్పాడు. తన ఫ్యామిలీ మరింత పెద్దది అయిందని చెబుతూ గాల్లో తేలిపోయాడు. తన తమ్ముడికి పాప పుట్టిందని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సుధీర్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మా ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త పాపను పరిచయం చేస్తున్నాను.. స్తుతి ఆనంద్ బయానా అంటూ పాప పేరు కూడా చెప్పేశాడు.. నీ చిన్ని పాదాలు.. మా గుండెల్లో చెరగని గుర్తులను వేశాయ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp