Sudigali Sudheer : రష్మి గౌతమ్ నా గుండెలో దాగుంది అంటూ సుడిగాలి సుధీర్ ఎమోషనల్ కామెంట్స్
Sudigali Sudheer : సుధీర్-రష్మీ ఈ జంట గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న రష్మీ కొద్ది రోజులుగ సుధీర్‌తో తెగ కెమిస్ట్రీ నడుపుతుంది. ఇప్పుడే కాదు ఎప్పటికీ డిమాండ్ ఉండే బుల్లితెర జోడీ రష్మీ- సుడిగాలి సుధీర్ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ ఇద్దరి లవ్ ట్రాక్, రొమాంటిక్ మ్యాటర్స్ ఆడియన్స్‌కి కిక్కిస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు ఎన్ని రూమర్స్ బయటకొచ్చినా ఆ డిమాండే వేరులే అన్నట్లుగా ఉంటుంది. […]
Sudigali Sudheer : సుధీర్-రష్మీ ఈ జంట గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న రష్మీ కొద్ది రోజులుగ సుధీర్‌తో తెగ కెమిస్ట్రీ నడుపుతుంది. ఇప్పుడే కాదు ఎప్పటికీ డిమాండ్ ఉండే బుల్లితెర జోడీ రష్మీ- సుడిగాలి సుధీర్ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ ఇద్దరి లవ్ ట్రాక్, రొమాంటిక్ మ్యాటర్స్ ఆడియన్స్‌కి కిక్కిస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు ఎన్ని రూమర్స్ బయటకొచ్చినా ఆ డిమాండే వేరులే అన్నట్లుగా ఉంటుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి ఫిదా అయిన ఆడియన్స్ ఎంతమంది అంటే మాటల్లో చెప్పలేం.
ఎవరికివారు తమ తమ టాలెంట్‌తో పాపులర్ ఆయనదాన్ని మించి జంటగా ఈ ఇద్దరూ ఫుల్ ఫేమ్ కొట్టేశారు. జబర్దస్త్‌తోనే కాదు ప్రతి స్పెషల్ డే రోజు ఈ ఇద్దరి స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది ట్రెండ్. ఇక ఈ ఇద్దరికీ కెమెరా ముందు పెళ్లి అయితే బోలెడన్ని సార్లు అయింది. సుధీర్- రష్మీ ఒకరినొకరు ఘాడంగా ప్రేమించుకుంటున్నారని, ఈ ఇద్దరూ కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారని చెప్పుకున్నారు. అయితే అవన్నీ రూమర్స్ అని రష్మీ, సుధీర్ ఖండించినప్పటికీ వార్తల ప్రవాహం ఆగడం లేదు. తాజాగా ప్రసారమైన ఓ షో ప్రోమోలో రష్మీ నా గుండెల్లోనే ఉంటుంది అంటూ అందరిముందే సుడిగాలి సుధీర్ ఓపెన్ కావడం హాట్ టాపిక్ అయింది.
Sudigali Sudheer : ఏం నడుస్తుంది?
ఇప్పుడు ఈ ప్రోమో వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. జీ తెలుగులో ఫాదర్స్ డే సందర్భంగా దిల్ సే అనే షో ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్‌కి గోపీచంద్, డైరెక్టర్ మారుతి, రాజీవ్ కనకాల, సింగర్ శైలజ, ఆమె భర్త శుభలేఖ సుధాకర్ తదితరులు హాజరై సందడి చేశారు. ఇదే వేదికపై సుధీర్ ఓపెన్ అయ్యారు.ఓ ఏడేళ్ల ఓ కుర్రాడు సుధీర్‌ని బాబాయ్ అని సంబోధిస్తూ ఆయనకు చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఆ పిల్లాడు.. రష్మీ పిన్ని ఏది బాబాయ్ అని అమాయకంగా అడగడంతో సుధీర్ కాస్త ఎమోషనల్ అయ్యారు. రష్మీ నా గుండెల్లో ఉంటుంది. బయటికి కనిపించదు అనేశాడు.ఇలా మట్లాడేసరికి ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుం సుధీర్- రష్మీ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.