sudheer : ఇది సుధీర్ లెవెల్.. యూట్యూట్‌లో ఫ్యాన్స్ హల్చల్
sudheer : జబర్దస్త్ టీమ్ లీడర్, యాక్టర్ సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అతనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేస్తున్న సుధీర్.. తనదైన శైలిలో అభిమానులను మెప్పిస్తున్నాడు. కామెడీ, డ్యాన్స్‌లు.. ఏదైనా సరే సుధీర్ ఉంటే అభిమానులకు పండగే. సుధీర్, రష్మీ కలిస్తే.. ఇంకేముంది ఫుల్ టీఆర్‌పీలు రావాల్సిందే అనేది అభిమానుల మాట. ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తునే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు సుధీర్.

sudigali sudheer excellent dance performance in dhee 13
ఇదిలా ఉంటే ఏదైనా మల్లెమాల ప్రోగ్రామ్‌లో సుధీర్ లేకపోతే.. యూట్యూబ్‌లో అతడి గురించి ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి షోలో సుధీర్ ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటారు. ఆ కామెంట్స్ గురించి కూడా బుల్లెట్ భాస్కర్ ఫన్నీగా స్కిట్స్‌లో ఫన్నీ కౌంటర్స్ వేస్తుంటాడు. అంటే సుధీర్‌కు ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఢీ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. అందులో సుధీర్ డ్యాన్సులు చూసిన అభిమానుల కామెంట్లతో యూట్యూబ్ మోత మోగిపోతోంది.
sudheer : డ్యాన్సులతో రచ్చ చేసిన సుధీర్

sudigali sudheer excellent dance performance in dhee 13
డ్యాన్స్‌తో కూడా మెప్పించే సుధీర్.. ఢీ షోలో పలు సందర్భాల్లో డ్యాన్స్ చేశాడు. అయితే తాజాగా మరోసారి ఢీ స్టేజ్‌పై సుధీర్ అద్భుతమైన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ క్వార్టర్ ఫైనల్స్ ఏపిసోడ్‌లో సుధీర్.. టెంపర్ సాంగ్ అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. సుధీర్ ఫర్ఫామెన్స్‌పై జడ్జిలు కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు. దీంతో సుధీర్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సుధీర్ దుమ్ము లేపాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
