Sudigali Sudheer : ఇంతకంటే దారుణం ఉంటుందా?.. సుడిగాలి సుధీర్‌కు దారుణమైన అవమానం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌కు బుల్లితెరపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంతటి అభిమాన గణం ఒక్క రోజులో వచ్చింది. ఎన్నో ఏళ్ల శ్రమ, ఎన్నో చీత్కారాలు, ఎన్నెన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సుధీర్ ఈ స్థానానికి చేరుకున్నాడు. బుల్లితెరపై మెగాస్టార్ రేంజ్‌లో సుధీర్ ఫాలోయింగ్ పెరిగింది. సుధీర్ ఉంటే ఏ షో అయినా సూపర్ హిట్టే.
అలాంటి సుధీర్‌ను స్కిట్ల పేరుతో దారుణంగా అవమానిస్తుంటారు. తాజాగా ఓ స్కిట్‌లో సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శ్రీనులను నరేష్, బాబు, పటాస్ ప్రవీణ్ కలిసి దారుణంగా రోస్ట్ చేశారు. మరీ ముఖ్యంగా సుధీర్‌ను ఘోరాతి ఘోరంగా అవమానించేశాడు. ఆ మొహం ఏంటి ఇంత దరిద్రంగా ఉంది.. దగ్గరకు రాకు అని పదే పదే ఒకే డైలాగ్‌తో నరేష్ రెచ్చిపోయాడు.ఇక సుధీర్ డబ్బులు ఖర్చు పెట్టి కామెంట్లను కొనుక్కుంటున్నాడన్నట్టుగా సెటైర్లు వేశారు.

Sudigali Sudheer Gets Humiliated In Extra Jabardasth
Sudigali Sudheer : సుధీర్‌కు తీవ్ర అవమానం..
కన్నడ వచ్చా? మరి కర్ణాటక నుంచి మెసెజ్‌లు ఏంటి.. కన్నడలో ఎందుకు వస్తాయ్ అని కౌంటర్ వేశాడు. ఈ మొహాన్ని చూసి మూడు సినిమాల ఆఫర్లు ఎవడ్రా ఇచ్చిందంటూ దారుణంగా సుధీర్‌ను అవమానిస్తుంటారు. మొత్తానికి సుధీర్‌ను ఎంత అవమానిస్తే అంత ఫన్ జనరేట్ అవుతుందని మల్లెమాల టీం ఫిక్స్ అయినట్టుంది.