Sudigali Sudheer : జబర్దస్త్ టీమ్ లీడర్ల అందరి పారితోషికంలో సుధీర్ కే తక్కువ.. ఎందుకో తెలుసా!
Sudigali Sudheer : ఒకప్పుడు తిండికి ఇబ్బంది పడ్డ కమెడియన్స్… ఉండడానికి ఇల్లు లేక రోడ్ల మీద ఉన్న కమెడియన్స్… కనీసం అద్దె చెల్లించ లేక ఇబ్బందులు పడ్డ కామెడియన్స్ జబర్దస్త్ కు వచ్చాక కార్ల లో తిరుగుతున్నారు. సొంత ఇల్లు కట్టుకున్నారు. తిండి లేని వారు ఏకంగా రెస్టారెంట్లను నడుపుతున్నారు. జబర్దస్త్ కారణంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా లాభపడ్డారు అనడంలో సందేహం లేదు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్న హైపర్ ఆది జబర్దస్త్ లో అడుగు పెట్టి స్టార్ అయ్యాడు. ఆయన ఆదాయం ఆస్తులు ప్రస్తుతం కోట్లలో ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఒక్కొక్క టీం లీడర్ ప్రస్తుతం నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ వారందరితో పోలిస్తే సుదీర్ జబర్దస్త్ రెమ్యూనరేషన్ తక్కువ అంటూ మల్లెమాల వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సాధారణంగా ఇతర టీం లీడర్లు తమ టీమ్ లో నటించిన వారికి కొంత మొత్తంలో పారితోషికం ఇస్తారు. కొంత మంది అమ్మాయిలకు అసలు పారితోషికం ఉండదు. కానీ సుడిగాలి సుదీర్ మాత్రం తన టీమ్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా భారీగా పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. గెటప్ శ్రీను మరియు రాంప్రసాద్ ఇంకా సుడిగాలి సుదీర్ సమానంగా తమకు వచ్చిన పారితోషికాన్ని పంచుకుంటారు. అందులోనే కొంత మొత్తాన్ని తమతో చాలాకాలంగా ట్రావెల్ చేస్తున్నా సన్నీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర కామెడియన్స్ కూడా అప్పుడప్పుడు సుధీర్ టీమ్ లో కనిపిస్తారు కనుక వారికి కూడా కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఇలా మొత్తం తనకు వచ్చిన పారితోషికంలో మెజారిటీ పారితోషికం పంచడానికే సరిపోతుంది. అందుకే సుడిగాలి సుదీర్ టీం లీడర్ లతో పోలిస్తే చాలా తక్కువ తీసుకుంటాడని సమాచారం అందుతోంది. సుడిగాలి సుదీర్ తన మంచి మనసు తో తన పారితోషికం లో మెజార్టీ శాతం ను పంపిణీ చేస్తున్నాడు. ఇప్పటికే తాను తక్కువ పారితోషికం తీసుకుంటాడు. తక్కువ పారితోషికం ఇస్తానంటే గెటప్ శ్రీను మరియు రామ్ ప్రసాదు ఏం చేయలేరు. కానీ సుడిగాలి సుధీర్ మాత్రం అలా చేయకుండా తాను ఎంత తీసుకుంటే వాళ్లకు కూడా అంత ఇస్తూ మంచి మనసుతో చాటుకుంటున్నాడు. ఇతర కార్యక్రమాల ద్వారా సినిమాల ద్వారా తనకు ఆదాయం వస్తుంది. కనుక జబర్దస్త్ మెజారిటీ పారితోషికం వేరే వాళ్ళకి ఇచ్చేందుకు సుడిగాలి సుదీర్ ఓకే చెబుతున్నాడు.