Sudigali Sudheer : అనసూయపై సుడిగాలి సుధీర్ సెటైర్లు.. గొట్టం అంటూ రెచ్చిపోయిన సుధీర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : అనసూయపై సుడిగాలి సుధీర్ సెటైర్లు.. గొట్టం అంటూ రెచ్చిపోయిన సుధీర్

 Authored By prabhas | The Telugu News | Updated on :26 July 2022,3:30 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఎక్కడుంటే ఫన్ అక్కడ ఉంటుంది. సుధీర్ ఉంటే చాలు షో అంతా కూడా సందడిగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుధీర్ ఎన్నో షోలు, ఈవెంట్‌లను బ్లాక్ బస్టర్ హిట్‌లను చేశాడు. టీఆర్పీలు రావాలంటే అక్కడ సుధీర్ ఉండాల్సిందే. అలా మొత్తానికి ఇప్పుడు సుధీర్ మాత్రం ఈటీవీకి దూరమయ్యాడు. స్టార్ మాకు దగ్గరయ్యాడు. ఇక అనసూయ సైతం ఈటీవీని వదిలింది. ఈ ఇద్దరూ స్టార్ మాలో సింగింగ్ షోలో సందడి చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సుడిగాలి సుధీర్ సందడి చేశాడు.సుడిగాలి సుధీర్ వేసిన పంచ్‌లకు అందరూ ఎగబడ్డారు. సుధీర్‌ను కొట్టేందుకు వచ్చారు.

ఇక అనసూయకు సుధీర్ సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ వచ్చాడు. మేం కూడా సిటీ నుంచి వచ్చామని అంటాడు సుధీర్. ఏం సిటీ అని అంటుంది అనసూయ. పబ్లిసిటీ అని సుధీర్ కౌంటర్ వేస్తాడు. నేను కూడా ఒకప్పుడు సిటీ నుంచి వచ్చాను అనిఅనసూయ అంటుంది. ఏం సిటీ అని సుడిగాలి సుధీర్ అడుగుతాడు. సింప్లిసిటీ అని అనసూయ అంటుంది. మీ ఇద్దరినీ చూస్తే నాకు ఓ సిటీకి వెళ్లాలనిపిస్తుంది అనిచిత్ర అంటుంది. ఏం సిటీ అని సుధీర్, అనసూయ అడుగుతాడు. స్కేర్ సిటీ అని చిత్ర అనడంతో అందరూ నవ్వుతుంటారు. మైక్‌ని, ఫోన్‌ని, లిప్ స్టిక్‌ని తెలుగులో ఏమంటారు అని అనసూయని అడుగు సుధీర్ ఆట పట్టించాడు. మైక్‌ని మైకు అని అంటారట.

Sudigali Sudheer Satires on Anasuya In Star Maa Singing Show

Sudigali Sudheer Satires on Anasuya In Star Maa Singing Show

అనసూయ అలా చెప్పడంతో సుధీర్ పరువుతీశాడు. ధ్వని శబ్ద గొట్టం అంటూ ఇలా ఏదో ఒకటిచెప్పాడు సుడిగాలి సుధీర్. ఫోన్‌ని చరవాణి అంటారని అనసూయ అనడంతో.. అది చరవాణి లంగావోణి కాదు.. శబ్ద మాటల గొట్టం అని అంటాడు సుధీర్. ఐస్ క్రీమ్‌ను హిమ క్రీము అని అంటారు అని అనసూయ అంటే.. హిమక్రీములు వేసుకునే గొట్టమని అంటాడు. లిప్ స్టిక్‌ని ఏమంటారు అని మళ్లీ అడుగుతాడు సుధీర్. దీనికి అనసూయ ఫైర్ అవుతుంది. దీనికి ఆన్సర్ సుధీర్ భయ్యే చెప్పాలని హేమచంద్ర అంటాడు. పెదాలను రంగు రంగులుగా మార్చే గొట్టం అని అంటాడు. ఇలా మొత్తానికి సుధీర్ మాత్రం ప్రోమోలో ఆడేసుకున్నాడు.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది