Sudigali Sudheer : డైలాగ్‌ను చంపేశారు కదా? అమ్మ.. రోజాపై సుడిగాలి సుధీర్‌సెటైర్లు
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌ది ఒక ఫేమస్ డైలాగ్ అందరికీ గుర్తుండి ఉంటుంది. నేను చస్తే నువ్ ఏడిస్తావో లేదో గానీ.. నువ్ ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతాను అనే డైలాగ్‌ను ఇది వరకు ఎన్నో సార్లు వాడేసి ఉన్నారు. సుధీర్ వాడిన ఈ డైలాగ్‌కు అప్పట్లో రష్మీ కూడా ఫిదా అయింది. ఎంతో ఎమోషనల్‌గా చెప్పిన ఈ డైలాగ్ రాను రాను కామెడీగా మారిపోయింది. అన్ని స్కిట్లలో ఇలాంటి డైలాగే చెప్పేస్తుండేవాడు సుధీర్.చివరకు ఆ డైలాగ్‌ను అందరూ కలిసి కామెడీ చేసి పడేశారు.
తాజాగా ఈ డైలాగ్‌ను మళ్లీ వాడేశారు. సుధీర్ వచ్చే వారం ఓ స్కిట్ వేయబోతోన్నాడు. ఒక్కరోజు ఏ అమ్మాయిని చూడకుండా ఉంటే ఆస్తి వస్తుందనే స్కిట్ వేశాడు. దీంతో ఎవ్వరినీ చూడొద్దని గట్టిగా అనుకుంటాడు. కానీ రష్మీ వచ్చి చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. పాటలు పాడుతూ రెచ్చగొడుతుంది. సుధీర్ డైలాగ్‌ను రష్మీ చెబుతుంది. ఇక నేను ఆగలేను అని అందులోంచి లేచి వస్తాడు. నువ్ ఏడిస్తే నేను చస్తాను అంటూ రష్మీ ఆ డైలాగ్‌ను తప్పుతప్పుగా చెబుతుంది.

Sudigali Sudheer Satires on Roja In Extra Jabardasth
ఆ వెంటనే రోజా అందుకుని డైలాగ్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. రోజా కూడా ఈ డైలాగ్‌ను మార్చి తప్పు తప్పుగా చెబుతుంది. దీంతో రష్మీ, రోజాలు చెప్పిన డైలాగ్‌లకు సుధీర్ నవ్వేస్తుంటాడు.మీరు డైలాగ్‌ను చంపేస్తున్నారు కదా? అమ్మా అంటూ రోజా మీద సుధీర్ సెటైర్లు వేస్తాడు. మొత్తానికి సుధీర్ ఫేమస్ డైలాగ్ కాస్తా ఇలా నవ్వులు పూయిస్తుంది. మరి రష్మీ సుధీర్‌లకు ఈ డైలాగ్ ఎంత సరిగ్గా సూట్ అందరికీ తెలిసిందే.
