Samantha : పెళ్లి అంటే మీ దృష్టిలో ఏంటి హీరోయిన్ సమంతనీ ప్రశ్నించిన సుమ వీడియో ..!!

Advertisement

Samantha : హీరోయిన్ సమంత మరియు విజయ్ దేవరకొండ కలిసి నటించిన సినిమా “ఖుషి”. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ మొదటి తారీకు విడుదల కాబోతోంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో లవర్స్ గా తర్వాత భార్యాభర్తలు గా విజయ్ దేవరకొండ.. సమంత కనిపిస్తూ ఉన్నారు. ఇంకా సినిమా విడుదల అవటానికి మూడు రోజులే టైం ఉండటంతో.. ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. తాజాగా యాంకర్ సుమ ఆమె భర్త రాజీవ్ కనకాల “ఖుషి” సినిమా టీంనీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన వచ్చింది.

Advertisement

హీరోయిన్ సమంత ని యాంకర్ సుమ మీ దృష్టిలో పెళ్లి అంటే ఏమిటి అని ప్రశ్నించగా సమాధానం దాటి వేస్తూ అది లవ్ అయినా కావచ్చు అని.. సమాధానం చెప్పాలని కోరారు. దీనికి సమంత.. మనం ఇష్టపడేది ప్రేమ. అది హార్మోని లేదా ఇంకా ఏదైనా కావచ్చు.. అంటూ సమాధానం ఇవ్వడం జరిగింది. ఇంకా ఇదే ఇంటర్వ్యూలో అనేక విషయాలకు సంబంధించి ప్రశ్నలు వేశారు వాటికి కూడా సమాధానాలు ఇచ్చారు. “ఖుషి” సినిమాలో ప్రేమతో పాటు పెళ్లికి సంబంధించిన కంటెంట్ ఉన్న క్రమంలో వ్యక్తిగత విషయాలకు సంబంధించి యాంకర్ సుమ ఎక్కువ ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ శివానిర్వానతో పాటు హీరో హీరోయిన్ సమంత అదే విధంగా విజయ్ దేవరకొండ..

Advertisement
suma asked what kind of heroine samantha sees marriage as
Samantha : పెళ్లి అంటే మీ దృష్టిలో ఏంటి హీరోయిన్ సమంతనీ ప్రశ్నించిన సుమ వీడియో ..!!

కమెడియన్ వెన్నెల కిషోర్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ “ఖుషి” సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రీవ్యూ షో పడటం జరిగింది. ఈ షోకి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది.

 

Advertisement
Advertisement