Bigg Boss 5 Telugu : పిచ్చి కుక్కల్లా అరుచుకున్నారు.. అత్యంత చెత్త ఎపిసోడ్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: October 30, 2021, 7:42 pm

బిగ్ బాస్ ఐదో సీజన్ ఎనిమిదో వారం మరీ ఇంత చెత్తగా ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. నామినేషన్ ప్రాసెస్ నుంచీ ఈ డల్ నెస్ కనిపిస్తూనే ఉంది. ఎమోషనల్ కంటెంట్‌‌లో భాగంగా.. ఇంటి సభ్యుల నుంచి లెటర్లు వచ్చాయి. ఆ లెటర్ అందుకున్న వారు నామినేషన్ నుంచి తప్పించుకుంటారు.. ఆ లెటర్ రాని వారు నామినేట్ అవుతారు అంటూ కండీషన్ పెట్టారు. అందులో కొందరు త్యాగమూర్తులు బయటకు వచ్చారు. ఎలిమినేట్ అయ్యారు.

Sunny And Jessie Fight In Bigg Boss 5 Telugu

Sunny And Jessie Fight In Bigg Boss 5 Telugu

ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే మరింత దారుణంగా ఉంది. ఏం చూపించాలో వారితో ఏం ఆడించాలో కూడా బిగ్ బాస్ టీం తోచలేదేమో. అందుకే ఓ రెండు యాడ్లు వేసేద్దాం.. డబ్బులు వస్తాయని అనుకున్నాడు. అందుకే యాడ్స్‌ను ప్రమోట్ చేసేలా ప్రొడక్ట్‌లు ఫేమస్ అయ్యేలా వావ్ తాజ్, హయర్ ఫ్రిడ్జ్‌ల మీద టాస్కులు పెట్టాడు. ఇక ఎపిసోడ్ మొత్తంగా సన్నీ, జెస్సీ వాగ్వాదం, సంచాలక్ నిర్ణయం తప్పంటూ మానస్, సన్నీ వాదించారు.

చిరాకు పుట్టించిన ఎపిసోడ్

వరెస్ట్ పర్ఫామెన్స్ సమయంలోనూ ఇదే గొడవ వచ్చింది. సన్నీ, కాజల్‌కు సరిసమానమైన ఓట్లు వచ్చాయి. షన్ను కెప్టెన్‌గా తన అభిప్రాయాన్ని చెప్పి సన్నీని జైళ్లో వేయాలని అనుకున్నాడు. ఫిజికల్ అవ్వడం నచ్చలేదంటూ బస్తాను తన్నిన విషయాన్ని వేలెత్తి చూపించాడు. అలా ఇద్దరి మధ్య మాటలు గ్రూపులుగా మారాయి. చివరకు జెస్సీ, సన్నీ మధ్య మాటా మాటాపెరిగాయి. బయటకు రా చూసుకుంటా? అని సన్నీ అన్నాడు. అర్జున్ రెడ్డిలా ఫీలవుతున్నావా? అని జెస్సీ కౌంటర్ వేశాడు. మొత్తానికి ఎపిసోడ్ మాత్రం చిరాకు పుట్టించింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp