Surekha Vani : చీర్స్ అంటూ త‌ల్లి కూతుళ్ల ర‌చ్చ‌.. బ్యాంకాక్ బ‌య‌లుదేరిన సురేఖా వాణి

Authored By Sam C | The Telugu News | Updated on : 25 April 2022, 7:40 am

Surekha Vani : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌ల్లిగా, అత్త‌గా, చెల్లిగా ఇలా ఎన్నో స‌పోర్టింగ్ పాత్ర‌లు పోషించి అల‌రించింది. ఇటీవ‌ల సినిమాల‌లో పెద్ద‌గా క‌నిపించ‌ని సురేఖావాణి కూతురితో క‌లిసి తెగ ర‌చ్చ చేస్తుంది. సురేఖా ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హంగామా చేస్తుంటారో తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెలబ్రిటీ హోదాలో సురేఖావాణి చిందులాటకు, సెలబ్రిటీ కిడ్‌గా సుప్రిత అందాలు యాడ్ అవుతూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుంటాయి. ఎవ్వరు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా, ఏ విధంగా రియాక్ట్ అయినా తమ లైఫ్ స్టైల్ తమదే అన్నట్లుగా ఆ ఇద్దరూ నెట్టింట హవా నడిపిస్తున్నారు.

కరోనా దెబ్బకు గత రెండేళ్లుగా దేశం దాటింది లేదు. దీంతో సురేఖ‌, సుప్రిత థాయ్‌లాండ్‌కు చెక్కేశారు. ఈ మేరకు సుప్రిత షేర్ చేసిన కొన్ని ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తల్లీకూతుళ్లిద్దరూ కూడా బిజినెస్ క్లాస్‌లో చెక్కేసినట్టున్నారు. ఇక బ్యాంకాక్ అంటే థాయ్ మసాజ్ ఫేమస్ అని అంటుంటారు. సుప్రిత థాయ్ మసాజ్‌ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇక ఫ్లైట్‌లో ఈ తల్లీకూతుళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మందు గ్లాసుతో చీర్స్ చెబుతూ ఈ ఇద్దరూ కనిపించారు. ఇన్ని రోజుల్లో గోవా, నార్త్ టూర్ అంటూ సురేఖా సుప్రిత సందడి చేశారు. ఇప్పుడు అక్కడ తెగ హంగామా చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.కరోనా సమయంలోనే గోవాకు చాలా సార్లు సుప్రిత, సురేఖా వెళ్లారు.

Surekha Vani tour with her daughter

ఇక సినిమా షూటింగ్‌ల కోసం నార్త్‌లోని కొన్ని ప్రదేశాల్లో తిరిగారు. సురేఖా వాణి కూతురు సుప్రీత ఎప్పటికపుడు నెటిజన్లతో మాట్లాడుతూనే ఉంటుంది. ఈ మధ్యే తన జీవితంలో జరిగిన వ్యక్తిగత విషయాలను సైతం వాళ్లతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే అప్పట్లో తండ్రి మరణం గురించి ఓపెన్ అయిపోయింది ఈమె. సురేఖా వాణి భర్త సురేశ్‌ తేజ అనారోగ్యంతో 2019లో చనిపోయారు. ఈయన కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు. తన తండ్రి మరణం ఇప్పటికీ తమను వెంటాడుతూనే ఉంటుందని గుర్తు చేసుకుంటుంది సుప్రీత. ప్రస్తుతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది సుప్రీత. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది సుప్రీత. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి