Surekhavani Daughter : అందుకే ఇంకా సింగిల్‌గా ఉందట.. వామ్మో సురేఖా వాణి కూతురు వేషాలు చూశారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Surekhavani Daughter : అందుకే ఇంకా సింగిల్‌గా ఉందట.. వామ్మో సురేఖా వాణి కూతురు వేషాలు చూశారా?

 Authored By prabhas | The Telugu News | Updated on :6 July 2022,10:00 am

Surekhavani Daughter : సురేఖా వాణి కూతురిగా సుప్రితకు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే.అయితే సుప్రిత మాత్రం తన కంటూ ఓ ఫాలోయింగ్‌ను సెట్ చేసుకుంది. నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటూ.. పొట్టి బట్టల్లో కనిపిస్తూ.. పార్టీలు, పబ్బులు అంటూ సందడి చేస్తూ.. ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూ తన ఫాలోవర్లను పెంచుకుంటూ పోయింది. ఇక ట్రోలింగ్, వాటి మీద సుప్రిత సెటైర్లు ఇలా అన్నీ కూడా ఆమెను విపరీతంగా పాపులర్ చేసేశాయి. సుప్రిత హాఫ్ నాలెడ్జ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ వంటి వాటిని నెటిజన్లు బాగా టార్గెట్ చేస్తూ వచ్చేవారు. వాటిపై సుప్రిత కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతుండేది. ఇక తమ మీద వచ్చే రూమర్లను మాత్రం సుప్రిత తీవ్రస్థాయిలో తిప్పి కొట్టేది.

ఇక తన తల్లి రెండో పెళ్లి గురించి పిచ్చి వార్తలు రాసే వారిపైనా సుప్రిత మండిపడుతుంటుంది. ఏదైనా పనికొచ్చే వార్తలు రాయండి.. ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు రాస్తుంటారు అని సుప్రిత ప్రశ్నిస్తుంటుంది. అయితే సుప్రిత అప్పుడప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది. లైవ్‌లోకి వచ్చి సర్ ప్రైజ్ చేస్తుంటుంది. అలా తాజాగా సుప్రిత తన ఫాలోవర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అందులో ఓ నెటిజన్ మాత్రం వింత ప్రశ్నను సంధించాడు. నువ్ ఇంకా ఎందుకు సింగిల్‌గానే ఉన్నావ్ అని అడిగేశాడు. దానికి సుప్రిత రెండు సమాధానాలు చెప్పింది. సింగిల్‌గా ఉండటమే క్రేజీగా ఉంటుంది..

Surekhavani Daughter Supritha Reason About Being Single

Surekhavani Daughter Supritha Reason About Being Single

అందుకే ఇలా ఉండిపోయాను అని చెప్పింది. ఆ తరువాత మరో పోస్ట్ వేసి.. బీస్ట్ సినిమాలోని పూజా హెగ్డే డైలాగ్ షేర్ చేసింది. తిన్నావా? బుజ్జి, బంగారం.. చిట్టి పొట్టి కుట్టి అనే మెసెజ్‌లు చేయడం నాకు చిరాగ్గా అనిపిస్తుంటుంది అని చెప్పేసింది. అంటే తనకు అలాంటివి ఇష్టం లేవని చెప్పేసింది. ఆ మధ్య సుప్రిత ప్రేమ, పెళ్లి విషయం బాగా ట్రెండ్ అయింది. వెళ్లిపో అనే ప్రైవేట్ ఆల్బమ్ కోసం సుప్రిత చేసిన ప్రమోషన్ స్టంట్ చిలికి చిలికి గాలి వానలా మారిపోయింది. చివరకు సుప్రిత దిగి వచ్చి.. ప్లీజ్ అలా రాయకండి.. తాను ప్రేమలో లేను.. అది కేవలం ప్రమోషన్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి