Bollywood Star Hero Wife : రెండో పెళ్లికి సిద్ధ‌మైన స్టార్ హీరో మాజీ భార్య‌..మ‌రి హీరో ప‌రిస్థితి ఏంటో? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bollywood Star Hero Wife : రెండో పెళ్లికి సిద్ధ‌మైన స్టార్ హీరో మాజీ భార్య‌..మ‌రి హీరో ప‌రిస్థితి ఏంటో?

 Authored By sandeep | The Telugu News | Updated on :7 August 2022,6:20 pm

Bollywood Star Hero Wife : బాలీవుడ్‌లో ప్రేమ‌లు, పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిల‌వ‌వు అనే సంగ‌తి తెలిసిందే. చిన్న చిన్న కార‌ణాల‌తో విడాకుల వ‌ర‌కు వెళుతుంటారు. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరుగాంచిన హృతిక్ రోషన్, సుసానే ఖాన్ లు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 14ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత హృతిక్‌- సుసానే ఖాన్‌లు 2014లో విడిపోయారు.. ప్రస్తుతం హృతిక్‌ బాలీవుడ్‌ నటి, సింగర్‌ సబా అజాద్‌తో డేటింగ్‌ చేస్తుండగా, సుసానే ఇప్పుడు అర్స్లాన్‌ గోనీతో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఈ జంటల పెళ్లి గురించి ఇప్పుడు ముంబై మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. సుస్సానే ఖాన్ తన జీవితంలోని అర్స్లాన్ గోనిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ తాజాగా ఓ సంచలన కథనం వెలువడింది. అయితే హృతిక్ రోషన్ కు మాత్రం మరింత సమయం కావాలి. అతడు సాబా ఆజాద్ ని ఇప్పట్లో పెళ్లాడబోరనేది ఈ కథనం సారాంశం…

Bollywood Star Hero Wife : ఏం జ‌రుగుతుంది..

సుస్సానే తన రిలేషన్ షిప్ లో తదుపరి అడుగు వేయడానికి సిద్ధంగా ఉందని ఇప్పుడు తాజాగా ముంబై మీడియాలో కథనాలొస్తున్నాయి.సుస్సానే .. అర్స్లాన్ చాలా పరిణతి చెందినవారు. వారు తమ జీవితాంతం కలిసి గడపాలని కోరుకుంటున్నారని తెలిసింది. ఈ జంట వివాహం చేసుకుంటున్నా అది చాలా సాధా సీదాగా ఉంటుందని సమాచారం. గ్రాండ్ సెలబ్రేషన్ ఉండదు. ఇక ఈ పెళ్లికి హృతిక్ మద్ధతు ఉండనుంది. ఇక హృతిక్ రోషన్ త‌న‌ లేడీ లవ్ సబా ఆజాద్ ను వివాహం చేసుకోబోతున్నాడని కథనాలొస్తున్నా దానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఈ జంట ఇంకా నిర్ణయించుకోలేదని కూడా కథనాలొస్తున్నాయి.

Sussane Khan wife second marriage news viral

Sussane Khan wife second marriage news viral

హృతిక్ రోషన్, సుసానేలు 14 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. వీరికి ఇద్దరు తనయులు ఉన్నారు. ఇద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ… తమ పిల్లలు ఒంటరివారు కాకూడదని.. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి సమయాన్ని గడుపుతుంటారు. విడిపోయినా మంచి ఫ్రెండ్స్ గా కలిసుంటుంటారు బాలీవుడ్ కపుల్. అంతే కాదు ఒకరికి ఒకరు ప్రతీ విషయంలో సపోర్ట్ చేసుకుంటుంటారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది