Tamannaah : తమన్నా బుల్లితెరపై కొత్త షో..అనసూయ, రష్మీ ఇక అవుట్..
Tamannaah : ఇంతకాలం బుల్లితెరను ఏలుతున్న వారిలో రష్మీ, అనసూయ అగ్ర తాంబూలం అందుకుంటున్నారు. గత పదేళ్ళుగా వీరికి సాటి పోటీ ఎవరూ రాలేదు. సుమ యాంకర్‌గా చేస్తున్నప్పటికి గ్లామర్ పరంగా వీరిద్దరికే ఎక్కువ క్రేజ్ ఉంది. మోడ్రన్, అల్ట్రా మోడ్రన్ డ్రసుల్లో అటు అనసూయ ఇటు రష్మీ జబర్దస్త్, ఢీ డాన్స్ షోస్ తో పాటు ఫెస్టివల్ ఈవెంట్స్.. స్పెషల్ ప్రోగ్రాంస్ తో బుల్లితెరపై సందడి చేస్తూ షేక్ చేస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో శ్రీముఖి, వర్షిణి ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ ఏ ప్లాట్ ఫాం ని వదలడం లేదు.

tamannaah new show on small screen
సినిమాలలో నటిస్తూనే, కమర్షియల్ యాడ్ ఫిలింస్, షాప్ ఓపెనింగ్స్ అంటూ సంపాదన ఉన్న ప్రతీ చోటకి వచ్చేస్తున్నారు. ఇక వెబ్ సిరీస్ లలో కూడా తమదే పై చేయి అన్నట్టుగా కమిటవుతున్నారు. ఈ క్రమంలోనే మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాలతో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికి ప్రముఖ ఛానల్ జెమినీ లో వచ్చే ఓ వంటల కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించడానికి సిద్దమయింది. తమన్నా భాటియా సినీ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళైనా కూడా ఆమె అందం పెరుగుతుందే తప్ప తరగడం లేదు.
Tamannaah : ఇటీవల డిజిటల్ రంగంలో కూడా అడుగుపెట్టి సక్సెస్ అయింది.
దాంతో తమన్నాకి క్రేజీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల డిజిటల్ రంగంలో కూడా అడుగుపెట్టి సక్సెస్ అయింది. ’11త్ అవర్’ ‘నవంబర్ స్టోరీస్’ అనే వెబ్ సీరీస్ లలో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మిల్కీ బ్యూటీ బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయింది. విదేశాల్లో బాగా పాపులర్ షో అయిన ‘మాస్టర్ చెఫ్’ కుకరీ షోతో తమన్నా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయింది.

tamannaah new show on small screen
Tamannaah : తిరుగులేని యాంకర్స్‌గా ఉన్న రష్మీ, అనసూయలకి ఇక కష్టమే
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ షో తెలుగు వెర్షన్ కు తమన్నా హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. తమిళ్ లో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి – మలయాళంలో పృథ్వీ రాజ్ – కన్నడలో కిచ్చ సుదీప్ ఈ వంటల షో కు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ‘మాస్టర్ చెఫ్’ ప్రోగ్రామ్ జెమినీ టీవీలో ప్రసారం కానుండగా..తమన్నా షో కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం ప్రసారమవుతూ ఆకట్టుకుంటోంది. దాంతో తమన్నా బుల్లితెర ఎంట్రీతో ఇప్పటివరకు తిరుగులేని యాంకర్స్‌గా ఉన్న రష్మీ, అనసూయలకి ఇక కష్టమే అనే టాక్ మొదలైంది. చూడాలి మరి తమన్నా ఏమేరకు బుల్లితెరపై ఆకట్టుకుంటుందో.
ఇది కూడా చదవండి ==> ఎద అందాలు ఎరవేస్తూ క్యూట్ స్మైల్‌తో చంపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్ వైరల్
ఇది కూడా చదవండి ==> మోనితను చంపినందుకు కార్తీక్ అరెస్ట్.. మోనిత శవాన్ని ఎక్కడ దాచావంటూ నిలదీసిన రోషిణి మేడమ్?
ఇది కూడా చదవండి ==> సమంత లేటెస్ట్ జిమ్ వీడియో వైరల్.. వర్కౌట్స్‌లో కూడా ఊపిరాడనీయడం లేదు
ఇది కూడా చదవండి ==> మహేష్ బాబు లెవెల్‌లో బిల్డప్.. చివరకు గాలిదీసేసిన డాక్టర్ బాబు