Tamannaah : తమన్నాని మళ్లీ అలాంటి ప్రశ్న వేసాడేంటి.. సురేష్ కొండేటికి స్టన్నింగ్ సమాధానం
Tamannaah : సురేష్ కొండేటి.. ఈయన సినిమా ప్రేక్షకులకి కొంత సుపరిచితమే. సొంతగా ఓ సినిమా పత్రిక నడుపుకునే సురేష్ కొండేటి.. అప్పుడప్పుడు వివాదాలలో నిలుస్తుంటాడు. డీజే టిల్లు ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో హీరోయిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్‌గా మారాడు.. ఈ సినిమా ట్రైలర్ లో హీరోయిన్ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయని హీరో అడిగే సన్నివేశం ఉంది. దాన్ని బేస్ చేసుకుని రియల్ గా ఆ హీరోయిన్ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నావా అంటూ హీరోని అందరిని అడిగేశాడు. దీంతో అందరు అవాక్కయ్యారు. అయితే హీరోయిన్ నేహాశెట్టి ఈ ప్రశ్నపై తీవ్రంగా స్పందించింది.
Tamannaah : మళ్లీ అలాంటి మాటలే..
అప్పటికప్పుడు స్టేజ్ పై సురేష్ కొండేటి దుమ్ము దులపకపోయినా.. సోషల్ మీడియాలో తన సమాధానంతో గడ్డి పెట్టింది. తన ఆగ్రహాన్ని, అసహనాన్ని అలా తెలియజేసింది.అయినప్పటికీ మనోడిలా ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా తమన్నాని విచిత్రమైన ప్రశ్న వేశాడు. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బబ్లీ బౌన్సర్. ఈ చిత్రానికి మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబరు 23న డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా.. అన్నపూర్ణ స్టూడియోలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్‌మీట్‌లో తమన్నా, మధుర్ భండార్కర్ మాట్లాడారు.
తమన్నాతో మాట్లాడిన సురేష్ కొండేటి.. ట్రైలర్ చూశాం. ఇందులో మీరు మెడికల్ షాప్‌కి వెళ్లి టాబ్లెట్‌తో పాటు కండోమ్ కూడా అడగడం ఆ తర్వాత మెడికల్ షాప్ ఓనర్‌తో నిశ్చితార్ధం గురించి ఏమని అంటారు అని అడగ్గా, దానికి నవ్వుతూనే సమాధానం ఇచ్చింది తమన్నా. ఇది చూసి మీరు చాలా నవ్వుతారు అని పేర్కొంది. ఇక ప్రెస్ మీట్ అనంతరం మీడియా ప్రతినిధులతో తమన్నా బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధులు తమన్నా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించినట్టుగా సమాచారం. ఆ సమంలో తమన్నా బౌన్సర్లు, మీడియా ప్రతినిధులు వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు కెమెరామెన్లకు స్వల్ప గాయాలయ్యాయి. చివరకు మీడియా వారికి ఆ బౌన్సర్లు క్షమాపణలు చెప్పేశారని తెలుస్తోంది..
