Tamannah : ఐస్‌క్రీం అమ్ముతున్న త‌మ‌న్నా.. ఈ అమ్మడికి ఏమైంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tamannah : ఐస్‌క్రీం అమ్ముతున్న త‌మ‌న్నా.. ఈ అమ్మడికి ఏమైంది?

 Authored By sandeep | The Telugu News | Updated on :20 March 2022,10:00 am

Tamannah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఈ ముద్దుగుమ్మ 15 ఏళ్ల క్రితం ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. ఈ ముద్దుగుమ్మ త‌న అంద‌చందాల‌తో సినిమా ప్రేక్ష‌కుల‌ని గెలుచుకుంది. ఆమె ఫేమ్, పాపులారిటీ అస్సలు తగ్గలేదు. స్టార్ హీరోయిన్ గా టాప్ స్టార్స్ తో నటించిన తమన్నా వన్నె తరగని గ్లామర్ తో యంగ్ హీరోయిన్స్ కి టప్ కాంపిటీషన్ ఇస్తున్నారు. చక్కని నటన, అంతకు మించిన గ్లామర్ ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతుంది. 2019లో విడుదలైన ఎఫ్ 2 చిత్రంలో తమన్నా, మెహ్రీన్ సెమీ బికినీలు వేసి షాక్ ఇచ్చారు. బికినీలలో పక్కపక్కనే ఇద్దరూ నడిచి వస్తుంటే, తమన్నా గ్లామర్ ముందు, మెహ్రీన్ పూర్తిగా డామినేట్ అయ్యారు.

కెరీర్ బిగినింగ్ లో పద్ధతిగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసిన తమన్నా… స్టార్ హీరోల చిత్రాలలో గ్లామర్ రోల్స్ చేశారు. స్టార్ గా అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే స్పెషల్ సాంగ్స్ చేయడం తమన్నా తీసుకున్నా డేరింగ్ స్టెప్. రంగం, అల్లుడు శీను, జై లవకుశతో పాటు పలు తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలలో ఆమె ఐటెం సాంగ్స్ చేశారు. స్పెషల్ సాంగ్స్ చేసిన వారికి హీరోయిన్ గా అవకాశాలు రావు అనేది అపోహ మాత్రమే అని తమన్నా నిరూపించారు. తమన్నా చేతిలో ఉన్న చిరంజీవి పెద్ద చిత్రం భోళా శంకర్ ఉంది.

tamannah cute look viral

tamannah cute look viral

Tamannah : త‌మ‌న్నా లుక్స్ అదిరాయి..

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో ఆమె మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ మూవీలో చిరంజీవి చెల్లెలుగా చేయడం విశేషం. వరుణ్ లేటెస్ట్ మూవీ గని లో ఓ స్పెషల్ సాంగ్ లో తమన్నా ఆడిపాడనున్నారు. గని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాల‌తో త‌మ‌న్నామళ్లీ అద‌ర‌గొట్ట‌నుంది. అయితే ఈ ముద్దుగుమ్మ మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తుంది. తాజాగా త‌మ‌న్నా ఐస్ క్రీమ్ అమ్ముతున్న‌ట్టు అద‌ర‌గొట్టింది. ఈ అమ్మ‌డిని చూసి మెస్మ‌రైజ్ అవుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది