Tamannah : త‌మ‌న్నా ధ‌రించిన డ్రెస్సు, చెప్పుల ధ‌ర వింటే మైండ్ బ్లాక్ అవ్వ‌డం ఖాయం..!

Tamannah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. వెండితెరపై తమన్నా ఎంత గ్లామర్ గా, హాట్ గా కనిపించినా ఎప్పుడూ ఒక స్థాయి దాటి అందాలు ఆరబోయలేదు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని పాత్రలు కూడా చేయలేదు. కమర్షియల్ సినిమాల్లో అవసరం మేరకు అందాలు ఒలకబోస్తూ వచ్చింది.

Advertisement

ప్రస్తుతం తమన్నా నటిస్తున్న బిగ్ మూవీ ఎఫ్3.ఎఫ్2 కి సీక్వెల్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఇది. తమన్నా వెంకటేష్ కి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల తాను నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘’జీ కర్దా’’ ప్రారంభానికి స్కై బ్లూ కలర్‌ డ్రెస్సులో వచ్చింది తమన్నా. అయితే అప్పటి నుంచి ఈమె ధరించిన డ్రెస్ గురించి ఆరా తీయడం మెుదలపెట్టారు నెటిజన్లు. ఈ డ్రెస్‌ రేటు రూ. 2,69,121 అని ప్రముఖ ఆంగ్ల మీడియాలో కథనం వెలువడటంతో అవాక్కయ్యారు.

tamannah dress cost in lakhs
tamannah dress cost in lakhs

Tamannah : త‌మ‌న్నా ర‌చ్చ‌..

ఆ డ్రెస్సుకు మ్యాచింగ్‌గా వేసుకున్న తమన్నా చెప్పులూ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటి ఖరీదును ఆరా తీయగా రూ. 90, 800గా తేలింది. సత్యదేవ్‌ సరసన ఈ మిల్క్‌ బ్యూటీ నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ త్వరలోనే విడుదకానుంది. సైరాలో చిరుతో జతకట్టిన మిల్కీ బ్యూటీ ప్రస్తుతం.. ‘భోళా శంకర్‌’ చిత్రంలో చిరంజీవితో కలిసి నటిస్తోంది. వీటితోపాటు పలు హిందీ ప్రాజెక్టులు తమన్నా చేతిలో ఉన్నాయి. త‌మ‌న్నా మ‌రో వైపు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది. చూస్తుంటే ఈ అమ్మ‌డి జోరు మాములుగా లేద‌నిపిస్తుంది

Advertisement