Bigg Boss Telugu 7 : డేంజర్ జోన్‌లో టేస్టీ తేజా.. వచ్చే వారం నామినేషన్స్‌లో పక్కా.. అందరికీ కట్టప్ప ఆయనే

Advertisement

Bigg Boss Telugu 7 : ఆదివారం ఎపిసోడ్ లో బాహుబలి ఎవరు, బళ్లాలదేవ ఎవరు, కట్టప్ప ఎవరు.. అనే దానిపై నాగార్జున ఒక గేమ్ ఆడిస్తాడు. అందులో ఎక్కువగా కట్టప్ప ఎవరు అనేదానికి చాలామంది మాత్రం తేజా పేరు మాత్రమే చెప్పారు. దానికి కారణం.. శుభశ్రీ.. సందీప్ పవరాస్త్రను దొంగలించినప్పుడు ఆ విషయాన్ని టేస్టీ తేజాకు దామిని చెప్పి.. దాన్ని టాంటాం చేస్తాడు తేజ. వెళ్లి తన బెస్ట్ ఫ్రెండ్ శోభాకు చెబుతాడు తేజ. దీంతో ఆమె వెళ్లి ప్రియాంకకు చెబుతుంది. ప్రియాంక వెళ్లి అమర్ దీప్ కు చెబుతుంది. అమర్ వెళ్లి సందీప్ మాస్టర్ కు చెబుతాడు. ఇలా.. ఆ విషయం ఒకరి నుంచి మరొకరికి పాకుతుంది. దాని వల్ల సందీప్ వెంటనే అలర్ట్ అయి దాన్ని కాపాడుకుంటాడు. ఒకవేళ ఆ విషయం సందీప్ కు తెలియకపోయి ఉంటే.. ఇంకో రెండు మూడు గంటలు అది శుభశ్రీ దగ్గర ఉండి ఉంటే.. ఖచ్చితంగా శుభశ్రీకి పవరాస్త్ర దక్కి ఉండేది.

Advertisement
tasty teja as kattappa in bigg boss telugu 7
kattappa

కానీ.. తేజా చేసిన పని వల్ల తిరిగి ఆ పవరాస్త్రను మళ్లీ దక్కించుకుంటాడు. అయితే.. టేస్టీ తేజా ఇలా ఒకరి ముందు ఒకలా.. మరొకరి ముందు మరోలా ప్రవర్తిస్తున్నాడని చాలామంది తేజాను కట్టప్పలా అనుకుంటున్నారు. చాలామంది అనుకున్నారు కూడా. అయితే.. కట్టప్పలా తేజా కనిపించడమే కాదు.. ఈ వారం నామినేషన్లలో ఖచ్చితంగా తేజాను ఎక్కువ మంది నామినేట్ చేస్తారు. అంటే దీని వల్ల తేజా డేంజర్ జోన్ లో ఉన్నట్టే.

Advertisement

Bigg Boss Telugu 7 : ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది వీళ్లే

రెండో వారం నామినేషన్ల నుంచి షకీలా ఎలిమినేట్ అయినా ముందుగా సేవ్ అయింది అమర్ దీప్, ఆ తర్వాత ప్రిన్స్ యావర్, ఆ తర్వాత రతిక సేవ్ అయింది. అంటే.. డేంజర్ జోన్ లో ఉన్న వారు గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజా, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి. ఒకవేళ ఈ వారం కూడా వీళ్లు నామినేట్ అయితే వీళ్లంతా మళ్లీ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఒకవేళ రతిక, ప్రిన్స్, అమర్ దీప్ నామినేషన్లలోకి వచ్చినా వాళ్లు సేవ్ అయ్యే చాన్స్ ఉంటుంది. అంటే ఈ వారం నామినేషన్లలో తేజ, గౌతమ్, ప్రశాంత్, శోభా శెట్టి ఈ నలుగురు ఉంటే వీళ్లలో ఒకరు ఔట్ అయినట్టే. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

Advertisement
Advertisement