Bigg Boss Telugu 8 : డబుల్ ఎలిమినేషన్.. ఈ రోజు మరో కంటెస్టెంట్ ఎలిమినేట్.. ఎవరంటే..!
ప్రధానాంశాలు:
Bigg Boss Telugu 8 : డబుల్ ఎలిమినేషన్.. ఈ రోజు మరో కంటెస్టెంట్ ఎలిమినేట్.. ఎవరంటే..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 మరి కొద్ది రోజులలో ముగియనుంది. ఎవరు టాప్ 5కి వెళతారు, ఎవరు కప్ అందుకుంటారనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌తో అందరికి పెద్ద షాక్ ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 30 ఎపిసోడ్‌లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా శనివారం నాడు మొదటగా ఓటింగ్‌లో అతి తక్కువగా ఉన్న టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా శనివారం నాడే పూర్తి అయింది. దాంతో బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది.ఆదివారం ఎపిసోడ్‌లో పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు.
Bigg Boss Telugu 8 ఊహించిందే జరిగింది..
పృథ్వీ ఎలిమినేషన్‌ను బిగ్ బాస్ 8 తెలుగు డిసెంబర్ 1 ఎపిసోడ్‌లో ప్రసారం చేయనున్నారు. పృథ్వీరాజ్ తన ప్రవర్తనతో ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది. పృథ్వీరాజ్‌ను విష్ణుప్రియ లవ్ చేయడం, కన్నడ బ్యాచ్‌కు నాగార్జున ఫేవరిజం చూపించడంతో ఇన్నాళ్లు సేవ్ అవుతూ వచ్చాడు. ఇక పృథ్వీరాజ్ ఎదుటివాళ్లను చిన్నచూపు చూస్తు తక్కువ అంచనా వేస్తూ అవమానించడంతో ఆయనని ఎలిమినేట్ చేయాల్సిందేనని డిమాండ్స్ బాగా వచ్చాయి. డబుల్ ఎలిమినేషన్‌లో మొదట అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది. అయితే ఫినాలే టికెట్ సంపాదించడంతో అవినాష్ సేఫ్ అయ్యారు.
ముందుగానే ఆయన నామినేషన్ నుంచి తప్పించారు హోస్ట్ నాగార్జున. ఆ తర్వాత చివరికి తేజ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు నాగ్.తేజ ఎలిమినేట్ అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. మా అమ్మ బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చింది అదే తన సక్సెస్ అని, దీంతో తన డ్రీమ్ నెరవేరిందని, అయినా ఇంకా రెండు వారాలు ఇందులో ఉండటం ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేసినట్టు తెలిపారు తేజ. అనంతరం స్టేజ్‌పైకి వెళ్లి ఆయన ఒక్కొక్కరి గురించి చెప్పారు. వెజిటేబుల్స్ లో ఎవరికి ఏది సూట్ అవుతుందో తెలిపారు. అవినాష్ ఉల్లిపాయ అని, బాగా ఆడతాడని తెలిపారు. మరోవైపు అవినాష్ ఫైనల్‌కి వెళ్లిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచాడు.