
Venu Swamy : ఏంది.. వేణు స్వామి ఇలా జరిగింది..!
Venu Swamy : హైదరాబాద్ : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి సమస్యలు కొత్త కాదు. సెలబ్రిటీలపై తన అంచనాల విషయంలో అతను చాలాసార్లు ఇబ్బందులను ఎదుర్కోవడం మనం చూశాం. అతని రాజకీయ అంచనాలు చాలా సమయాల్లో తప్పుగా నిరూపించబడ్డాయి. దీని వల్ల అతను సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంటాడు. అయితే, వేణుస్వామి తాజా అంచనా ఆయనను పెద్ద చిక్కుల్లో పడేసింది. వేణు స్వామి తన తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య – శోభిత ధూళిపాళ నిశ్చితార్థం తర్వాత వారిపై అంచనాలు వేసిన సంగతి తెలిసిందే. ఈ జంట కలిసి ఉండకపోవచ్చని, మూడేళ్లలో విడిపోతారని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దాంతో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) మరియు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TFDMA) సభ్యులు తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశారు. వేణు స్వామి అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఇరు వర్గాలు పేర్కొన్నాయి. దాంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ నెల 22న తమ ముందు హాజరు కావాలని వేణుస్వామికి నోటీసులు పంపింది.
Venu Swamy : ఏంది.. వేణు స్వామి ఇలా జరిగింది..!
గతంలో వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యాలు కొన్నిసార్లు కరెక్ట్ కాగా.. చాలాసార్లు బెడిసి కొట్టాయి. కేసీఆర్, జగన్ జాతకాలు బాగున్నాయని ఈసారి వాళ్లే అధికారంలోకి మళ్లీ వస్తారని చెప్పుకొచ్చాడు. కానీ తీరా చూస్తే వారిద్దరూ ఓడిపోయారు. ఇక ప్రభాస్ సినిమాలు అయితే ఆడవని, ఆయన ఆరోగ్యం కూడా బాగుండందంటూ పదే పదే చెబుతుంటాడు. కానీ చివరకు కల్కి వెయ్యి కోట్లు కొల్లగొట్టింది. ఇలా వేణు స్వామి చేసిన విశ్లేషణ, జాతకాలు చెప్పడంపై అందరూ భగ్గుమన్నారు.
Sankranti Holiday : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. వారం రోజుల ముందే మొదలైన పండుగ సందడి భోగి,…
Sankranti Festival : సంక్రాంతి పండుగ వేళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరోసారి కోడిపందాలతో సందడిగా మారింది. పండుగ రెండో…
Central Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న తరుణంలో, దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ముఖ్యంగా పీఎం కిసాన్…
Mana Shankara Vara Prasad Garu Movie : మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు వేటను…
Bhartha Mahasayulaki Wignyapthi Movie : మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం “ భర్త మహాశయులకు విజ్ఞప్తి…
Ys Jagan Jr Ntr : ఏపీ రాజకీయాల్లో 2029 ఎన్నికల వ్యూహాలకు సంబంధించి అప్పుడే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా…
Indian Army Jobs : భారత సైన్యంలో పౌర సిబ్బందిగా సేవలందించాలనుకునే నిరుద్యోగులకు 2026 నియామక ప్రక్రియ ఒక గొప్ప…
Today Gold Rate 16 January 2026 : బంగారం & వెండి ధరలు భారీగా పెరుగుతూ సామాన్య ప్రజలకు…
This website uses cookies.