Thaman : పూర్తిగా భ్రష్టు పట్టించిన తమన్.. దిగు దిగు నాగ అంటూ ఛండాలం.. వీడియో!
Thaman సంగీత దర్శకుడిగా తమన్ Thaman ఇప్పుడు ఎంతటి ఫాంలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ Tollywood టాప్ డైరెక్టర్, ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు కూడా వర్క్ చేస్తున్నాడు. ముందునుంచి తమన్ మీద కాపీ మరకలున్నాయి. ఆయన కొట్టిన పాటల్లో దాదాపు ఎక్కడి నుంచో లేపేసినవే ఉంటాయి. కొన్ని సార్లు తాను కొట్టిన వాటినే అటూ ఇటూ మార్చేసి వాడుకుంటాడు. ఇక ఇప్పుడు తెలుగు సంగీత దర్శకులు అయితే జానపదాల మీద పడుతున్నారు. వాటి ట్యూన్లు, పాటలను ఇష్టానుసారంగా వాడేసుకుంటున్నారు. వాటికి ఉన్న అర్థాలను మార్చేసి భ్రష్టు పట్టిస్తున్నారు.
భ్రష్టు పట్టించిన తమన్.. Thaman
తాజాగా తమన్ Thaman నాగ శౌర్య సినిమా వరుడు కావలెను కోసం దిగు దిగు నాగ అనే పాటను వాడేశాడు. ఈ పాట తెలుగు వారికి సుపరిచితమే. నాగుల చవితి, నాగరాజును కొలిచేందుకు ఎంతో భక్తితో పాడుకునే ఈ పాటను తమన్ Thaman ఖూనీ చేసేశాడు. మొత్తానికి దీన్ని ఓ ఐటం సాంగ్‌లా మార్చేశాడు. దిగు దిగు నాగా.. పల్లవిని వాడటమే కాదు.. ఆ ట్యూన్‌ను అచ్చంగా దించేశాడు. ఇక ఈ పాటలో భార్యభర్తల మధ్య ఉండే సరసాలను తన స్టైల్లో రాసేశాడు అనంత్ శ్రీరామ్. శేఖర్ మాస్టర్ కుప్పి గంతులను కంపోజ్ చేసేశాడు.
ఓ భక్తి పాటను ఇలా భ్రష్టు పట్టించేలా చేయడం కేవలం తమన్‌కే చెల్లినట్టుంది. గతంలోనూ దిగు దిగు నాగా అనే పాటను వాడిన వారున్నారు. సర్పయాగం సినిమాలో రాజా రవీంద్ర, వాణీ విశ్వనాథ్‌ల మీద ఈ పాటను చిత్రీకరించారు. కానీ దాని బాణీ వేరు. ఇక అల్లరి నరేష్ బెండు అప్పారావ్ సినిమాలోనూ ఉన్నది ఉన్నట్టు వాడేశారు. కానీ అది కాస్తా భక్తి నేపథ్యంలోనే చిత్రీకరించినట్టు అనిపిస్తుంది. కానీ తమన్ Thaman Thaman మాత్రం పూర్తిగా ఛండాలంగా మార్చేసినట్టు కనిపిస్తోంది. మరి ఈ వివాదం ఎంత వరకు అగ్గిరాజేస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి ==> కష్టాల్లో జబర్దస్త్ చంటి.. లోన్లు, ఈఎంఐలు కట్టలేక అలా!
ఇది కూడా చదవండి ==> వంటలక్క, సుమక్క సరసన నవ్యస్వామి.. ఈ సారి అంతకు మించేలా?
ఇది కూడా చదవండి ==> కేరవ్యాన్‌లో సుమ కష్టాలు.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అంటోన్న స్టార్ యాంకర్.. వీడియో
ఇది కూడా చదవండి ==> అందాల దాడి చేస్తోన్న ఇస్మార్ట్ పోరీ.. చీరలో నభా పరువాల విందు!