Mega Family Vs Allu Family : మెగా వారితో అల్లు వైరం నిజమే.. ఇది ప్రత్యక్ష సాక్ష్యం అంటున్న యాంటీ ఫ్యాన్స్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :31 January 2023,1:00 pm

Mega Family Vs Allu Family : మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ ఆరంభంలో అల్లు రామలింగయ్య మరియు ఆయన తనయుడు అల్లు అరవింద్ అత్యంత కీలక పాత్ర పోషించారు అనేది అందరూ ఒప్పుకునే విషయమే. మెగాస్టార్ చిరంజీవి స్టార్ అయిన తర్వాత అల్లు ఫ్యామిలీని కాస్త దూరం పెట్టాడు అంటూ పుకార్ల షికారులు చేస్తున్నా యి, అప్పట్లోనే ఈ ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు నిజం కాదని అల్లు మరియు మెగా ఫ్యామిలీ ఎప్పుడు సన్నితంగా ఉంటాయి అని పలు సందర్భాలతో నిరూపించారు. కానీ గడచిన పది సంవత్సరాలు కాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్‌ వార్‌ సాగుతుందని స్వయంగా ఫ్యాన్స్ కూడా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ల యొక్క స్టార్‌ డమ్‌ గురించి తెగ హడావుడి సాగుతోంది.

The differences between the Chiranjeevi And Allu Aravind families are real

The differences between the Chiranjeevi And Allu Aravind families are real

దాంతో రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా అల్లు అర్జున్‌ తాను మెగా ఫ్యామిలీ హీరోని అంటూ చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి యొక్క పేరును కూడా ప్రస్తావించలేదు. దానికి తోడు అల్లు అరవింద్ గతంలో చిరంజీవితో సినిమా నిర్మించాలని భావించాడు, కానీ ఇప్పుడు ఆ ఆలోచన కూడా చేయడం లేదు. అందుకే చిరంజీవి మరియు అల్లు అరవింద్ మధ్య ఏదో గొడవ జరిగింది అంటూ చాలా మంది భావిస్తున్నారు. ఇదే సమయంలో మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా బ్లడ్ బ్యాంక్ లో జెండా వందనం కార్యక్రమం జరిగింది.

The differences between the Chiranjeevi And Allu Aravind families are real

The differences between the Chiranjeevi And Allu Aravind families are real

ఆ కార్యక్రమంలో చిరంజీవితో పాటు అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఇద్దరు మొక్కుబడిగానే మాట్లాడుకున్నారు తప్పి మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేదు అంటూ కొందరు యాంటీ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా కొన్ని వీడియోలను మరియు ఫోటోలను షేర్ చేయడం జరిగింది. దాంతో అల్లు అరవింద్ కి మెగాస్టార్ చిరంజీవికి విభేదాలు ఉన్న మాట వాస్తవమే అని చాలా మంది నమ్ముతున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆ మెగా ఫ్యామిలీ లేదా అల్లు వారి ఫ్యామిలీ స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి