Ticket Rates : టిక్కెట్ల రేట్లు పెంచి బాదుడే బాదుడు.. ఇలా కాకుండా కోట్లు రాబట్టలేరా..!
ప్రధానాంశాలు:
Ticket Rates : టిక్కెట్ల రేట్లు పెంచి బాదుడే బాదుడు.. ఇలా కాకుండా కోట్లు రాబట్టలేరా..!
Ticket Rates : ఇటీవలి కాలంలో తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ క్రమంలో పెట్టిన పెట్టుబడి రాబట్టేందుకు భారీగా టిక్కెట్ రేట్లు పెంచుతున్నారు. అయితే టిక్కెట్ రేట్లు పెంచడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా టికెట్ల రేట్ల పెంపును ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నించారు. సినిమా వాళ్లు వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారని నారాయణ ఓ సారి ఫైర్ అయ్యారు.. వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీసి… రెండు వేల కోట్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. సందేశాత్మక చిత్రాలకైతే ప్రోత్సాహకాలు ఇవ్వాలని… క్రైమ్, అశ్లీలతలను పెంచే సినిమాలకు ప్రోత్సాహకాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఎర్ర చందనం స్మగ్లర్ ని హీరోగా చూపించి… దాన్ని యువత మీద రుద్దుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
Ticket Rates ఏది కరెక్ట్..
ఇటీవల కాలంలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ రేట్లు విపరీతంగా పెంచిన సంగతి తెలిసిందే. వాటికి కలెక్షన్స్ వచ్చాయి కదా అని మిగిలిన సినిమాలకి, డబ్బింగ్ సినిమాలకి కూడా టికెట్ రేట్లు పెంచడంతో మొదటికే మోసమొచ్చింది. జనాలు ఎవ్వరూ థియేటర్ కి కూడా రాలేదు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు దిగి రాక తప్పలేదు. కొన్ని రోజుల క్రితం అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ లు స్వయంగా టికెట్ రేట్లు పెంచి తప్పు చేశామని, రాబోయే సినిమాలకు టికెట్ రేట్లు పెంచమని తెలిపారు. అయితే టికెట్ రేట్లు పెంచకుండా 200..300..500 కోట్ల వసూళ్లు సాధ్యమవ్వవా? అంటే ఎందుకు సాధ్యం కాదన్నది సామాన్యుడి ప్రశ్న. తప్పని పరిస్థితిలో పెంచినా ఆ ధర అన్నది సామాన్యప్రేక్షకుడికి సైతం అందుబాటులో ఉండాలనే వాదన తెరపైకి వస్తుంది.
మలయాళ సినిమాలు తెలుగులో కూడా కోట్ల వసూళ్లను రాబడుతున్నాయి.సాధారణ ధరతోనే ఆ సినిమాలు రిలీజ్ అయి మంచి వసూళ్లను రాబట్టాయి. వాస్తవానికి ఆ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యే సమయానికి మాతృభాషలో రిలీజ్ అయిపోయి ఉంటాయి. అయిన తెలుగులో మంచి ఆదరణ లభిస్తుంది. కంటెంట్ ఉన్న చిత్రాలు తెలుగు నుంచి రిలీజ్ అయితే వందల కోట్లు సాధ్యం కాదా? వారంలోనే టికెట్ ధరలు పెంచి ప్రేక్షకుడిని నడ్డి విరిచేయాలా? వందల కోట్లు ఖర్చు చేసామని ప్రేక్షకుడి ఆదాయాలతో సంబంధం లేకుం డా ఇష్టాను సారం టికెట్ ధరలను పెంచడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓ మాస్తరు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయి.