Tollywood sequals : తెలుగులో ఈ 15 సినిమాల సీక్వెల్స్ ఇక రానట్టేనా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tollywood sequals : తెలుగులో ఈ 15 సినిమాల సీక్వెల్స్ ఇక రానట్టేనా..!

 Authored By govind | The Telugu News | Updated on :27 June 2021,11:30 am

Tollywood sequals : మన సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో సీక్వెల్స్ అన్నవి ఎప్పటి నుంచో వస్తున్నవి. ఈ సీక్వెల్ తీసే ఆలోచన హాలీవుడ్ సినిమాల నుంచి కలిగింది. హాలీవుడ్ లో కొన్ని యాక్షన్ అండ్ అడ్వెంచర్ సినిమాలకు వరుసగా సీక్వెల్స్ వచ్చి ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ చేశాయి. దాంతో బాలీవుడ్ లో ఈ ట్రెండ్ మొదలైంది. ధూమ్, క్రిష్ సినిమాల ఫ్రాంఛైజీలు వచ్చాయి. ఇప్పటికే ధూమ్ సిరీస్‌లో మూడు భాగాలు, క్రిష్ సిరీస్ లో మూడు భాగాలు వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు ఫ్రాంఛైజీస్‌లో 4 వ భాగానికి సన్నాహాలు చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్.

Tollywood Sequels of these 15 movies are yet to come

Tollywood Sequels of these 15 movies are yet to come ..

ఇక తెలుగులో బాహుబలి రెండు భాగాలుగా వచ్చి అఖండ విజయాన్ని అందుకుంది. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 తెరకెక్కుతోంది. కన్నడతో తో పాటు ఇతర సౌత్ భాషలలో వచ్చి పాన్ ఇండియన్ స్థాయిలో సక్సెస్ సాధించిన సినిమా కేజీఎఫ్. దీని సీక్వెల్ ఇప్పుడు రెడీ అవుతోంది. తమిళంలో కూడా సూర్య సింగం సిరీస్‌లో ఇప్పటికే మూడు భాగాలు చేశాడు. హరి ఈ సీక్వెల్స్ రూపొందించాడు. ఇప్పుడు హరి – సూర్య కలిసి మరోసారి సింగం సిరీస్ లో 4వ భాగాన్ని చేయబోతున్నారు.

Tollywood sequals : ‘బిజినెస్ మెన్’ సీక్వెల్ ఉంటుందని స్వయంగా పూరి చెప్పాడు.

అయితే వీటి మాదిరిగా టాలీవుడ్ లో 15 సినిమాలకి సీక్వెల్ వస్తాయని అన్నారు కానీ రాలేదు. ఆ సినిమాలేవో ఒకసారి చూద్దాం. పూరి జగన్నాథ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘బిజినెస్ మెన్’. ఈ సినిమా సీక్వెల్ ఉంటుంది అని స్వయంగా పూరి చెప్పాడు. కానీ దీని సీక్వెల్ రాలేదు. అంతేకాదు పూరి – మహేష్ కాంబోలో అనుకున్న జనగణమన కూడా ఆగిపోయింది. ఇక మాస్ మహారాజ రవితేజ – సురేందర్ రెడ్డి కాంబోలో కిక్, కిక్ 2 వచ్చాయి. ఒకటి బ్లాక్ బస్టర్ మరొకటి భారీ డిజాస్టర్. అందుకేనేమో కిక్ 3 ప్లాన్ చేసి డ్రాపయ్యారు.

Tollywood sequals : అనిల్ రావిపూడి సీక్వెల్స్ మీద బాగానే ఫోకస్ పెడతాడు.

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో బాలీవుడ్ దబాంగ్ సినిమా రీమేక్‌గా గబ్బర్ సింగ్ వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత దీనికి సీక్వెల్ అంటూ సర్దార్ గబ్బర్ సింగ్ తీశాడు. వీటిలో కూడా ఒకటి సూపర్ హిట్, ఒకటి యావరేజ్. అందుకే రాజా సర్దార్ గబ్బర్ సింగ్ తీయాలనుకొని ఆగిపోయారు. రాజా ది గ్రేట్ 2 చేయాలని డైరెక్టర్ అనిల్ రావిపూడి, రవితేజ అనుకున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ మంచి హిట్ గా నిలిచింది. మరి ఈ సీక్వెల్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. అనిల్ రావిపూడి సీక్వెల్స్ మీద బాగానే ఫోకస్ పెడతాడు.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా సీక్వెల్ కబాలి 2 ప్లాన్ చేశారు. కానీ కబాలి ఫ్లాప్ అవడంతో సీక్వెల్ డ్రాపయినట్టు సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తుపాకి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అందుకే దీని సీక్వెల్ అనుకున్నారు. కానీ ఇప్పట్లో ఉండే అవకాశం లేదనిపిస్తోంది. ఎందుకంటే విజయ్ చేతిలో రెండు పాన్ ఇండియన్ సినిమాలున్నాయి. గత ఏడాది జెంటిల్ మ్యాన్ సీక్వెల్ ఉంటుందని నిర్మాత కుంజుమన్ ప్రకటించాడు. కానీ కరోనా కారణంగా ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉంది.

Tollywood sequals : అదుర్స్ సినిమా సీక్వెల్ ప్లాన్ చేసి డ్రాపయ్యారు.

ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ, విక్రమార్కుడు సినిమాల సీక్వెల్స్ ఉంటాయని అన్నారు. కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. బహుషా ఆ సీక్వెల్ ఇక ఉండకపోవచ్చు. ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడు. ఇది వచ్చేసరికి మరో మూడేళ్ళైనా పడుతుంది. ఇక జూనియర్ ఎన్.టి.ఆర్ డ్యూయల్ రోల్ లో నటించిన అదుర్స్ సినిమా సీక్వెల్ ప్లాన్ చేసి డ్రాపయ్యారు. అలాగే అడవి 2 అనే సినిమా కూడా రావాల్సింది. దీనిని వదిలేశారు. తెలుగులో నాని నిర్మాతగా మారిన తీసిన సినిమా అ..!దీని సీక్వెల్ వస్తుందని అన్నారు. కానీ క్రియేటివ్ డిఫ్రెన్స్ వల్ల ఆగిపోయింది. వీటితో పాటి క్రాక్, జాంబిరెడ్డి, తమిళ హిట్ సినిమా ఖైదీ సీక్వెల్ ప్లాన్ చేశారు. ఇవి లేటెస్ట్ సినిమాలు కాబట్టి ఆగిపోయాయని ఇప్పుడే చెప్పలేము.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది