Trivikram : త్రివిక్రమ్ నన్ను దారుణంగా మోసం చేశాడు ” టాప్ నటి తీవ్ర వ్యాఖ్యలు .. వీడియో తో సహా ఇరికించింది.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trivikram : త్రివిక్రమ్ నన్ను దారుణంగా మోసం చేశాడు ” టాప్ నటి తీవ్ర వ్యాఖ్యలు .. వీడియో తో సహా ఇరికించింది.. !

 Authored By prabhas | The Telugu News | Updated on :19 November 2022,2:20 pm

Trivikram : ధర్మచక్రం అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి తెరంగేట్రం చేసింది హీరోయిన్ ప్రేమ. ఇక ఆ తర్వాత దేవి చిత్రంలో నటించి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈమె నటించింది చాలా తక్కువ సినిమాలే అయినా వాటిలో మంచి సినిమాలు చాలా ఉన్నాయని చెప్పాలి. అయితే ఆమె నటించిన చిరునవ్వుతో అనే సినిమా ఆమె కెరియర్ ను పూర్తిగా మార్చేసింది అని చెప్పాలి. అప్పటివరకు మంచి సినిమాలు చేసిన ప్రేమకు త్రివిక్రమ్ చిరునవ్వుతో సినిమాలో ఆఫర్ ఇవ్వడం జరిగిందట.

ఇంకా ఈ సినిమా కథ చెప్పే సమయంలో చిరునవ్వుతో సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో మీరు నటించాలని చెప్పారట. కానీ విడుదలయ్యాక చూస్తే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కాదు కదా అదొక నెగిటివ్ పాత్రగా మిగిలిపోయింది. దీంతో ప్రేమ ఇమేజ్ చాలానే డామేజ్ అయిందని చెప్పాలి. దర్శక ధీరుడు త్రివిక్రమ్ చిరునవ్వుతో సినిమా తర్వాత మీ కెరియర్ అద్భుతంగా ఉంటుందని ప్రేమతో చెప్పడం జరిగిందట . అయితే కథ చెప్పే సమయంలో ఒక విధంగా చెప్పి, చిత్రీకరణ సమయంలో మరో రకంగా చిత్రీకరించారని దీంతో త్రివిక్రమ్ నన్ను మోసం చేశారని ప్రేమ తెలియజేసింది. అయితే చిరునవ్వుతో సినిమాకు రచయితగా త్రివిక్రమ్ వ్యవహరించారు.

top actress comments on Trivikram

top actress comments on Trivikram

ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది కానీ ప్రేమ కెరియర్ కు ఇది ఒక పులిస్టాప్ అని చెప్పాలి. దీనివలన ఆమె కెరియర్ నాశనం అయిందని ప్రేమ తెలియజేసింది. ఇక ఇప్పుడు రి ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తనకు నచ్చే పాత్రలు రాలేదని చెప్పుకొచ్చింది. తన మనసుకు నచ్చిన పాత్ర లభిస్తే రి ఎంట్రీ కచ్చితంగా ఇస్తానని ప్రేమ చెబుతోంది .అయితే ఎంతో చక్కటి అందం , అభినయం కలిగి ఉన్న ప్రేమ తన సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ ను సాధిస్తుందో లేదో వేచి చూడాలి. ఈ విషయం తెలుసుకున్న , అభిమానులు ఆమె రి ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. మరికొందరు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది