పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ అతడే.. గుట్టు విప్పిన త్రివిక్రమ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ అతడే.. గుట్టు విప్పిన త్రివిక్రమ్

 Authored By bkalyan | The Telugu News | Updated on :12 January 2021,8:38 pm

అల వైకుంఠపురములో సినిమా విడుదలై నేటికి ఏడాది కావొస్తుంది. ఈ క్రమంలో టీం అంతా కూడా రీయూనియన్ పేరిట ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో త్రివిక్రమ్ ఫుల్ హడావిడి చేశాడు. మామూలుగానే మైకు దొరికితే స్టేజ్ ఎక్కితే త్రివిక్రమ్ మాటలతో చంపేస్తాడు. అయితే ఈ సారి మాత్రం కాస్త సరదాగా ముచ్చట్లు పెట్టేశాడు. సాధారణ జనాలకు అర్థమయ్యేలానే మాట్లాడాడు. కొంటె కామెంట్లుకూడా చేశాడు.

Trivikram about Pooja Hegde Boyfriend

Trivikram about Pooja Hegde Boyfriend

అలా త్రివిక్రమ్ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరి గురించి చెప్పాడు. ఈ సినిమా అంత బాగా రావడానికి, ఇంత పెద్ద క్యాస్టింగ్‌ను కో ఆర్డినేట్ చేయాలంటే అది మామూలు విషయం కాదని త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. అదంతా కూడా తన కో డైరెక్టర్ల క్రెడిట్ అని తెలిపాడు. ఇలా మాట్లాడుతూ పూజా హెగ్డే గుట్టు విప్పేశాడు. పూజా హెగ్డేకు రోజూ తన అసిస్టెంట్ డైరెక్టర్ స్టోరీ మొత్తాన్ని చెప్పేవాడట.

అతను పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ అయిపోయాడట.. రోజూ అతను కథ మొత్తం నెరేట్ చేస్తూఉంటే పూజా హెగ్డే మాత్రం నిద్రపోయేదంటా. అలా ప్రతీ రోజూ సినిమాను, ఆమె పాత్రను అలా ఎక్కించేవాడంటూ తన అసిస్టెంట్ డైరెక్టర్ గురించి చెప్పేశాడు. ఇక అలా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేయడంతో పూజా కూడా ఒక్కసారిగా షాక్ అయింది. ఆ తరువాత త్రివిక్రమ్ దగ్గరకు వచ్చి ఎదో మాట్లాడేసింది.

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది