Mahesh Babu : సూపర్ స్టార్ కథ, మహేష్ బాబు స్క్రీన్ ప్లే విషయంలో అలాగే డైలాగుల విషయంలో చాలా పక్కాగా ఉంటారు. మాస్ ఆడియన్స్ కోసం దర్శకుడు మాస్ యాంగిల్‌లో రాసిన డైలాగ్స్ కాస్త అభ్యంతరకరంగా ఉన్నా కూడా అలాంటి డైలాగులను చెప్పడానికి నిర్మొహమాటంగా నో చెప్పేస్తాడు.
ఇక సీన్స్ విషయంలో అయితే, అసలు కాంప్రమైజ్ కాడు. ఆ సీన్ బదులు వేరే సీన్ పెట్టమని చెప్పిన సందర్భాలూ చాలా ఉన్నాయి. దీనికి కారణం మహేశ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్. అంతేకాదు, మహేశ్‌ను చాలా క్లీన్ హీరోగా చూస్తున్నారు.
అలాంటప్పుడు తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ఒక్క డైలాగ్ ఉన్నా మహేశ్ సహించడు. అలాంటిది ఏకంగా సెకండాఫ్ సంతృప్తికరంగా లేకపోయినా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే అసలు అయ్యేపనే కాదు. వంశీ పైడిపల్లి సీమాను కూడా లైన్ నచ్చినా పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ నరేషన్ నచ్చక వదులుకున్నాడు. ఇప్పుడు అలాంటి సమస్య త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ విషయంలో వచ్చినట్టు తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫిబ్రవరిలోనే మహేష్ బాబు -త్రివిక్రమ్ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఓపెనింగ్ కార్యక్రమాలను కూడా జరుపుకుంది.
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా ఫిక్సైయ్యాడు. అయితే, ఇటీవలే ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్‌కు ఫారిన్ ట్రిప్‌కు వెళ్ళాడు మహేశ్. అయితే, మహేష్ బాబుకి ఫైనల్ వెర్షన్ వినిపించడానికి వెళ్ళిన త్రివిక్రమ్ సెకండాఫ్
స్క్రిప్ట్‌తో మెప్పించలేకపోయినట్టు టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు సెకండాఫ్ విషయంలో కొన్ని మార్పులు సూచించినట్టు తెలుస్తోంది. ఇండియాకు వచ్చిన త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు చెప్పిన మార్పులు చేస్తూ సెకండాఫ్ కథపై వర్క్ చేస్తున్నారట. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందో చూడాలి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా వచ్చిన సంగతి తెల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.